Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి స్వల్ప గాయాలు
- లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ - మేడ్చల్ కలెక్టరేట్
పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. బుధవారం ఉదయం శామీర్‌పేట మండలం, అంతాయిపల్లి గ్రామంలో మేడ్చల్ నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తిరిగి మేడ్చల్ కలెక్టరేట్‌కు వస్తుండగా యాద్గార్‌పల్లి అవుటర్‌రింగ్ రోడ్డుపై వెనుక నుంచి వచ్చిన లారీ మంత్రి ఫార్చునర్ కారును ఢకొీట్టింది. కారు వెనక భాగం పూర్తిగా ధ్వసమైంది. ఈ ఘటనలో మంత్రి తలసాని సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి
వాహనంలోనే ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి మరో వాహనంలో మేడ్చల్ కలెక్టరేట్‌కు బయలుదేరారు. సుధీర్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు యథావిధిగా మేడ్చల్ జిల్లా ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి కారును ఢకొీట్టిన లారీడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.