Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిమెంట్ రోడ్డుపైనే డాంబర్‌రోడ్డు
- రోడ్డువేయగానే పగుళ్లు
- సిమెంట్ తక్కువ ఇసుక ఎక్కువ
- నాసిరకంగా మరుగుదొడ్లు
రోడ్డు వేసిన వెంటనే పెచ్చులుగా లేచిపోతున్న డాంబర్...బస్తా సిమెంట్‌కు 60 టెంకలకు పైనే ఇసుక వాడటం...కట్టామంటే కట్టామన్నట్టుగా వాటర్ ట్యాంకులు...ఇవీ మేడారం జాతరలో జరుగుతున్న పనుల తీరు. తూతూ మంత్రంగా చేసి పనులు పూర్తయినట్టు అధికారులు రిపోర్టు ఇచ్చేస్తున్నారు. అంతిమంగా మేడారం పనుల్ని చూస్తే...
ఏ పని చూసినా ఏమున్నది గర్వకారణం అంతా అవినీతిమయం అనిపించక మానదు.
(మేడారం నుంచి పార్నంది వెంకటస్వామి)
మేడారం పనుల కింద రోడ్లు, భవనాల శాఖకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. అందులో 15 కోట్లు పగిడిపల్లి నుంచి కాల్వపల్లి వరకు రోడ్లు నెంబర్ 43/0 నుండి 58 వరకు మూడు బిట్లుగా విడగొట్టారు. ఈ పనుల్ని కాంట్రాక్టర్లు తిరుపతి పటేల్, సంపత్‌రావు, ప్రభాకర్‌రెడ్డిలు దక్కించుకున్నారు. 80శాతం పనులు పూర్తయ్యాయి. రోడ్డు మందంగా పోయట్లేదు. పైగా దొడ్డు కంకర ఎక్కువ కలపడంతో రోడ్డు కంకర కంకరగా కనిపిస్తున్నది. రోడ్డు చివరన ఇప్పుడే బెచ్చలు బెచ్చలుగా లేచిపోతున్నది. పంచాయతీ రాజ్ శాఖకు 3 కోట్లు కేటాయించగా ఈ పనులతో గ్రామాలకు లింక్ రోడ్లు వేస్తున్నారు. కన్నెపల్లికి వెళ్లే దారిలో గత జాతర సందర్భంగా సీసీ రోడ్డు వేశారు. మధ్యభాగం పాడై కంకర తేలిందన్న కారణంతో మళ్లీ 15లక్షలకు కేటాయించారు. ఈ రోడ్డు పనులు స్థానిక ఎంపీటీసీ రాజు దక్కించుకున్నారు. సీసీ రోడ్డుపై 20ఎంఎం డాంబర్ రోడ్డు పోస్తుండటంతో కింది సీసీ రోడ్డు కనిపిస్తున్నది. అసలు ఈ రోడ్డు ఎందుకు వేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక రెడ్డిగూడెంను అనుకొని వాగు పక్కన హెలిప్యాడ్‌కు వెళ్లే దారిలో వేస్తున్న ప్యాచ్ వర్క్స్ దారుణంగా ఉన్నాయి. వేసిన రోడ్డు జాతర ప్రారంభం కాకముందే లేచిపోతున్నది. పస్రా నుంచి నార్లాపూర్ వరకు ప్యాచ్ వర్క్స్ కోసం 50లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. రోడ్డు పాడైన చోట మళ్లీ డాంబర్ వేస్తున్నారు. వేసిన వెంటనే పగుళ్లు పట్టాయి. ప్రాజెక్టునగర్ గ్రామం నుంచి వెంగళాపూర్ గ్రామం వరకు 10కిపైగా ప్యాచ్‌వర్కులు చేయగా అన్ని చోట్లా రోడ్డు పగుళ్లు పట్టింది. పెద్ద పెద్దగా పగుళ్లు పట్టడంతో వాహనాలకు బ్రేక్‌లు కొడితే పడిపోయే ప్రమాదముంది. కార్లు, ద్విచక్ర వాహనదారులు అక్కడికి రాగానే వాహనాల్ని నిలిపివేస్తున్నారు.
వెంగళాపూ ర్‌కు ముందు రెండు చోట్ల వేసిన రోడ్డు పూర్తిగా పగుళ్లు పట్టింది. మధ్యలో పగుళ్లు పట్టడమే కాకుండా రోడ్డు చివరి భాగం లేచిపోతున్నది. డాంబర్ వేసినా కంకర కనిపిస్తోంది. ఈ పనుల్ని అధికారులు సమర్ధి ంచుకుం టున్నారే తప్ప పొరపాటు జరిగిందని అంగీకరి ంచడం లేదు. పోసిన వెంటనే వాహనాలు వెళ్లటం వల్ల అలా జరిగిందని ఆర్‌అం డ్‌బి డీఈ ఒకరు చెప్పారు.
నీళ్లు పోయడం లేదు
మరుగుదొడ్ల పనులు నాసిరకంగా జరుగు తున్నాయి. ఒక బస్తా సిమెంట్‌కు పోయాల్సినదానికంటే రెండు, మూడు రెట్లు ఎక్కువగా పోస్తున్నారు. ఇసుక కుప్పపైనే సిమెంటు పోసి కలుపుతున్నారు. దాంతోనే గోడ కడుతున్నారు. నార్లాపూర్ సమీపంలో మరుగుదొడ్లు కడుతున్న ఓ కార్మికున్ని ఇదేంది అన్ని ప్రశ్నించగా..'మేమే బిత్తర పోతున్నం. మీకేం చెప్పాలి. చేయమన్నట్టు చేస్తున్నాం' అంటూ సమా ధానం చెప్పాడు. ఇక నల్లాలు ఏర్పాటు చేయగా వాటి చుట్టూ గోడ కడుతున్నారు. అది మూడు నుంచి నాలుగు ఇంచులతో నిర్మాణం చేస్తు న్నారు. కట్టిన మరుసటి రోజే పెచ్చులుగా ఊడిపో తున్నది. నీరు పెట్టడం లేదు. ఇసుక ఎక్కువ వాడుతూ సిమెం ట్ తక్కువగా వాడుతుండటంతో పనులు పేలవంగా ఉన్నాయి. పనుల మీద ఇసుక కనిపిస్తున్నది.