Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఐద్వా రాష్ట్ర కమిటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రమాద ఘటనపై కమిటీ నాయకులు మల్లు స్వరాజ్యం, బి.సరళ, మల్లు లక్ష్మీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 55 మంది ప్రాణాలు కోల్పోడానికి ప్రభుత్వమే నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. ఘాట్‌రోడ్డుపై భారీ వాహనాలు వెళ్లకూడదని నిబంధనలు ఉన్నా ఆదాయం పెంచుకునేందుకు డిపో మేనేజర్ బస్సు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారన్నారు. కాలం చెల్లిన బస్సుల్లో మోతాదుకు మంచి ప్రయాణికులను ఎక్కించుకొని ఆర్టీసి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. అంతేకాకుండా డ్రైవర్లకు అదనపు డ్యూటీలు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియోతో పాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.