Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకుదారి చూపేది బీఎల్‌ఎఫ్
- మా ఎజెండాపై మాట్లాడే దమ్ము ఆ పార్టీలకు లేదు:
- జనగామ ఎన్నికల సభలో తమ్మినేని
- కదిలొచ్చిన ఎర్రదండు
నవతెలంగాణ-జనగామ ప్రతినిధి
ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని భూకబ్జాలకు పాల్పడే ముత్తిరెడ్డి లాంటి
కమ్యూనిస్టు కాలంలోనే అభివృద్ధి.. : సారంపల్లి మల్లారెడ్డి
జనగామ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న కాలంలో జరిగిందేనని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఏసిరెడ్డి నర్సింహారెడ్డి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించారన్నారు. అప్పటి ట్యాంకులకే ఇప్పుడు నీలిరంగు సున్నం వేసి మిషన్ భగీరథ ట్యాంకులుగా చెబుతున్నారన్నారు. ఆస్పత్రితోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీపీఐ(ఎం) కాలంలోనే జరిగాయన్నారు.కబ్జాకోరులను ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయన్నారు. ఇప్పటికీ వలసలు తగ్గడం లేదన్నారు. జనగామ నుంచి నిరుద్యోగులు పట్టణాల్లో గోడలకు రంగులు వేయడానికి వెళ్తున్నారన్నారు. బీఎల్‌ఎఫ్‌ను గెలిపించడం ద్వారా అభివృద్ధికి బాటలు పడే అవకాశం ఉంటుందన్నారు.
''పేదలకు భూమి లేకనే సంపదకు దూరమవుతున్నారు. అందుకే బతుకుదారి చూపే బహుజన ఫ్రంట్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించండి. జనగామలో బీఎల్‌ఎఫ్ బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి ఉడుత రవిని అత్యధిక ఓట్లతో గెలిపించి అసెంబ్లీకి పంపాలి'' అని బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జనగామ అభ్యర్థి ఉడుత రవి శనివారం నామినేషన్ వేశారు. జనగామ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్య, వైద్యం పేదలకు అందకుండా పోయాయన్నారు. రాజకీయ పదవులు, ఆస్తి, పెత్తనం అగ్రవర్ణ ధనవంతుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. భూములు పంచుతామని చెప్పిన కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో పేదల భూములు లాక్కున్నారన్నారు. పోడు భూముల్ని సైతం గుంజుకున్నారని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలోనూ భూ పంపిణీ జరిగిందన్నారు. రైతు కష్టాలు తీరాలంటే గిట్టుబాటు ధర కల్పించి అమలు చేస్తామని ప్రకటించే దమ్ము టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఉందా అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని గొప్పలు చెప్పిన కేసీఆర్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్న ఉత్త్తమ్‌కుమార్‌రెడ్డి మిగతా పోస్టులపై మాట్లాడటం లేదన్నారు. ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించే పారిశ్రామిక విధానం రావాలన్నారు. బీఎల్‌ఎఫ్ అధికారంలోకొస్తే చదువుల సావిత్రి ద్వారా ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివే వరకు ప్రభుత్వమే ఆర్థికసాయం అందిస్తుందన్నారు. రైతు బంధుతోపాటు కూలీబంధు పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. తాము చెప్పినవి చేస్తామని చెప్పే దమ్ము, ధైర్యం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఉందా అని ప్రశ్నిం చారు. సామాజిక, బతుకు తెలంగాణ చూపిస్తామన్నారు. అందరూ ఆత్మగౌ రవంతో బతకాలంటే సామాజిక వివక్షను రూపుమాపాలన్నారు. ఇది కేవలం బహుజనుల్ని గెలిపించుకోవడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. బీఎల్‌ఎఫ్ 102 సీట్లు ప్రకటించగా అందులో 51 టిక్కెట్లు బీసీలకు ఇచ్చినట్టు చెప్పారు. అందులో 22మంది ఎంబీసీలు ఉన్నారన్నారు. మార్క్స్, అంబేద్కర్, పూలే ఆశ యాల నుంచి పుట్టిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌కు ప్రజల ఆదరణ ఉందని చెప్పారు.
నర్సంపేట, ములుగు బీఎల్‌పీ అభ్యర్థుల నామినేషన్
నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లో బీఎల్పీ అభ్యర్థులు మద్దికాయల అశోక్, తవిటి నారాయణ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం బీఎల్పీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలు రైతు నాగలి గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఉడుత రవి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.