Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నూరు నుంచి బోడ జనార్ధన్
- ట్రాన్స్‌జెండర్ చంద్రముఖికి గోషామహల్ కేటాయింపు
- 14 మందితో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఐదోజాబితా
- వంద మందికి సీట్లు కేటాయింపు
- కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకున్న ఓ ముఠా : జనార్ధన్
- రెబెల్ ఫ్రంట్ మిత్రులు బీఎల్‌ఎఫ్‌లోకి రావాలి : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ మంత్రి బోడ జనార్ధన్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)లో చేరారు. శనివారం హైదరాబాద్‌లో బీఎల్‌ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కండువా కప్పి బీఎల్‌ఎఫ్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోడ జనార్ధన్ మాట్లా డుతూ 1985లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాననీ, ఎన్టీఆర్
హయాంలో కార్మిక, ఉపాధి కల్పన మంత్రిగా పని చేశాననీ చెప్పారు. 20 ఏండ్లు ప్రజాప్రతినిధిగా ఉన్నాననీ అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకే టీడీపీని వీడీ కాంగ్రెస్‌లో చేరాననీ వివరించారు. రేవంత్ వెంట కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని రాహుల్‌గాంధీ అంటే నమ్మామని అన్నారు. కానీ కాంగ్రెస్‌లో కుంతియా, ఉత్తమ్, భట్టి విక్రమార్క ఓ ముఠాగా ఏర్పడి టికెట్లు అమ్ముకోవచ్చనే ఆలోచనతో అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం చేశారని ఆరోపించారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు తొలి జాబితా ప్రకటించిందని చెప్పారు. రేవంత్ వెంట వచ్చిన చాలా మందికి టికెట్లు ఇవ్వకుండా అవమానపరిచారని అన్నారు. కానీ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు తనను పోటీ చేయాల న్నారని చెప్పారు. ఇతర నియోజకవర్గాల్లో సీట్లు రాని వారు 40మంది కలిసి రెబెల్ ఫ్రంట్‌గా ఏర్పడి స్వతంత్ర అభ్యర్థు లుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బీఎల్‌ఎఫ్ పాటు పడుతోందని చెప్పారు. బీఎల్‌ఎఫ్‌లోకి తనను ఆహ్వానించ డం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈనెల 19న చెన్నూ రు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పా రు. రెబెల్ అభ్యర్థులు మరింత మంది చేరే అవకాశముందనీ, ఈనెల 20న చర్చలు జరుపుతామనీ అన్నారు.
బీఎల్‌ఎఫ్‌ను ఆశీర్వదించాలి : తమ్మినేని
రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో ప్రజలు బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను ఆశీర్వదించాలని బీఎల్‌ఎఫ్ కన్వీనర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు, సామాజిక న్యాయం ఎజెండాగా ఏర్పడిన బీఎల్‌ఎఫ్‌లో బోడ జనార్ధన్ చేరడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసమే బీఎల్‌ఎఫ్ ఆవిర్భవించిందని చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించడమే కాకుం డా స్వచ్ఛ పరిపాలన చేయడమే లక్ష్యమని ప్రకటించారు. రెబెల్ ఫ్రంట్‌గా ఏర్పడిన మిత్రులు బీఎల్‌ఎఫ్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఆదివారం తుది జాబితా ప్రకటిస్తామ న్నారు. మొదటిసారి ట్రాన్స్‌జెండర్‌కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. గోషామహల్ నుంచి చంద్రముఖి పోటీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్య ప్రకాశ్, నాయకులు జి రాములు, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.