Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జస్టిస్ చంద్రకుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారికి చట్టాలు, న్యాయసూత్రాలపై అవగాహన అవసరం అని జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు. 1926లో ట్రేడ్ యూనియన్ యాక్ట్, 1947లో పరిశ్రమల వివాదాల చట్టం అమల్లోకి వచ్చాయని, వీటిని ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక సంఘాల కార్యకలాపాల్లో తలదూర్చడం, విఘాతం కల్పించడం వంటి చర్యలు నేరపూరితమైనవేనని చెప్పారు. ఆయా చట్టాలపై ప్రభుత్వం న్యాయశాస్త్ర కోవిదుల సలహాలు తీసుకోవాలని, ఈ చట్టాలపై సరైన అవగాహన లేనందునే ప్రస్తుత పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు కన్పిస్తోందని అన్నారు.