Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ నిర్వాకం
- 6,450 మందికి నోటీసులు
- 25 నుంచి అమ్మకానికి సిద్ధం
- రుణాల వసూళ్లకేనంటున్న అధికారులు
నవతెలంగాణ- జనగామ ప్రతినిధి
అప్పులు తీర్చలేదనే కారణంతో రైతుల భూములను వేలం వేసేందుకు సిద్ధమైంది వరంగల్ డీసీసీబీ. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మొదటి విడతలో 351మంది రైతుల భూములను వేలం వేయనున్నారు. ఈ నెల 25న జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం తిమ్మాపూర్ నుంచి వేలం మొదలు పెట్టను న్నారు. పంటల దిగుబడి లేక అప్పు చెల్లించలేని స్థితిలో ఉన్న రైతుల భూములను వేల వేసేం దుకు నోటీసులివ్వడంతో కన్నీరు మున్నీరవు తున్నారు. వరంగల్ డీసీసీబీ పరిధిలో 69 ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. 1999 నుంచి 2010 వరకు 8,459మంది రైతులు రూ.26కోట్ల 39లక్షల దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. తమ భూమి ని బ్యాంకుకు మార్టిగేజ్ చేసి రుణాలు పొందారు. ఈ రుణాలు ఐదేండ్ల కాలపరిమితిలో వడ్డీతో చెల్లించాలి. ప్రతి రైతు రూ.30వేల నుంచి మొదలుకొని రూ.10లక్షల వరకు రుణం పొందారు. కాలం కలిసిరాక పంటలు దిగు బడి లేకపోవడంతో 6,450మంది రైతులు పూర్తిస్థాయిలో అప్పులు చెల్లించలేదు. రెండు, మూడు కిస్తీలు చెల్లించినా రెండేండ్లుగా కరువుతో ప్రయివేటు అప్పులతోపాటు డీసీ సీబీ అప్పులు మీదపడ్డాయి. దీంతో
మొండి బకాయిలు వసూలు చేయడం కోసం డీసీసీబీలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మూడు నెలల నుంచి వసూళ్లు మొదలుపెట్టగా రూ.5.70కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.20.69కోట్లు వసూలు కావాల్సి ఉంది. వాటికి 6,450 మందిని గుర్తించి నోటీసులు జారీ చేశారు.
మొదటి విడతలో...
డీసీసీబీ పరిధిలో మొదటి విడతలో 351మంది రైతుల భూములను వేలం వేయాలని నిర్ణయించారు. 6,450మంది అప్పు చెల్లించాల్సి ఉంది. ములుగు డీసీసీబీ పరిధిలో 342మంది రూ.96.74లక్షలు చెల్లించాలి. ఈ ప్రాంతాల్లో భూములున్నా సాగు, దిగుబడి తక్కువ. నెక్కొండలో 1098మంది రైతులు రూ.4కోట్ల 20లక్షల 88వేలు చెల్లించాలి. తొర్రూర్‌లో 344మంది కోటీ 6లక్షల 37వేలు చెల్లించాలి. వర్ధన్నపేటలో 93లక్షల 98వేలు చెల్లించాలి. ఈనెల 25న జఫర్‌గడ్ మండలం తిమ్మాపూర్, 26న సూరారం, 27న స్టేషన్‌ఘనపూర్ మండలంలోని తాటికొండ గ్రామాల్లో భూముల వేలానికి బ్యాంకు వారు సిద్ధమయ్యారు. భూముల వేలం కోసం డీసీసీబీ అధికారులు ఇప్పటికే నాలుగు దఫాలుగా నోటీసులు జారీ చేశారు.గడువు పెంచాలి అప్పు చెల్లించాల్సిన గడువు ముగిసిందనే పేరుతో రైతుల భూములను వేలం వేయడం సరి కాదు. కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేయడం, గడువు పెంచినట్లే సహకార బ్యాంక్ పరిధిలో రుణాలు పొందిన రైతులకు గడువు పెంచాలి. రైతులు అప్పులు చెల్లించకపోవడానికి కరువు, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడమే కారణం. రైతును ఆదుకోవాల్సింది పోయి భూములు వేలం వేయడం సరికాదు. వారికి చేయూతనివ్వాలి. వేలం వేస్తే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళ నలు చేపడతాం.
పంటల దిగుబడి లేకనే..
నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని తనఖా పెట్టి రూ.2లక్షల 70వేల అప్పు తీసుకున్నా. పంటలు దిగుబడి లేకపోవడం వల్లే బ్యాంకు అప్పులు సకాలంలో చెల్లించలేదు. ఇప్పుడు నాకు నోటీసు జారీ చేశారు. నాతోపాటు మరికొందరు రైతులకు నోటీసులు వచ్చాయి.
ఉన్న భూమి పోతే ఎలా బతకాలి.
సముద్రాల సత్యనారాయణ- జఫర్‌గఢ్
రుణ వసూళ్లకు కఠిన నిర్ణయాలు తప్పవుబకాయిల వసూళ్ల కోసం కఠిన నిర్ణయాలు తప్పవు. 15 ఏండ్ల నుంచి భూములను తనఖా పెట్టి తీసుకున్న డబ్బులు చెల్లించడం లేదు. గడువు ముగిసిన రైతుల భూములను మాత్రమే వేలం వేస్తాం. వేలం వేయడానికి ముందు నోటీ సులు జారీ చేశాం. 2010వరకు అప్పు తీసుకున్న మొండి బకాయిలు వసూలు చేయడానికి వేలం వేస్తున్నాం. 2012 నుంచి అప్పులు తీసుకుని చెల్లించని వారిపైనా దృష్టి సారిస్తాం.
- డీసీసీబీ సీఈవో అంజయ్య