Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి
- 17 మందికి గాయాలు
- హాలియాలో ఓ వ్యక్తి కాలుపై నుంచి వెళ్లిన టైరు
- కూకట్‌పల్లిలో తాత్కాలిక డ్రైవర్‌కు దేహశుద్ధి
నవతెలంగాణ- సంగారెడ్డి టౌన్/ కూకట్‌పల్లి/ హాలియా
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిస్కారం కోసం సమ్మె చేస్తుండగా.. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ.. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడిపించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. సంగారెడ్డిలో బస్సు టాటాఏసీ వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. నల్లగొండ జిల్లా హాలియాలో ఓ ప్రయాణికుని కాలుపై నుంచి బస్సు వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆర్టీసీ బస్సు ప్రయివేట్ బస్సును ఢకొీట్టింది. దాంతో ప్రయాణికులు తాత్కాలిక డ్రైవర్‌పై దాడి చేశారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చౌటకూర్ గ్రామానికి చెందిన 19మంది టాటాఏసీ వాహనంలో సోమవారం కొండాపూర్ మండలం గుంతపల్లిలో బంధువుల ఇంట్లో అంత్యక్రియలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెన్నార్ చౌరస్తా వద్దకు రాగానే ఆర్టీసీ బస్సు ఢకొీట్టింది. దీంతో టాటాఏసీలో ప్రయాణిస్తున్న 19మందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు భాగ్యమ్మ(70), చంద్రకళ(38). 17 మందికి గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా కిష్టయ్య, లింగయ్య, మహేశ్, పోచయ్య, టాటాఏసీ వాహనం డ్రైవర్ షబ్బీర్‌ను హైదరాబాద్‌కు తరలించారు. స్వల్పగాయాలైన వారికి సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, టాటాఏసీనే బస్సును ఢకొీట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
ప్రయివేటు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
హైదరాబాద్ కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో మూసాపేట్ నుంచి కూకట్‌పల్లి వెళ్తున్న ప్రయివేటు బస్సును వెనుక నుంచి ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ప్రయివేటు బస్సు డ్రైవర్, ప్రయాణికులు ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ రసూల్‌పై దాడి చేశారు. రసూల్ హైదరాబాద్-2 డిపోకు చెందిన తాత్కాలిక డ్రైవర్. ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నుజ్జునుజ్జయిన ప్రయాణికుడి కాలు
నల్లగొండకు చెందిన చంద్రకుమార్ హాలియా వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. హాలియా పట్టణంలో ప్రయాణికులందరితోపాటు చంద్రశేఖర్ కూడా బస్సు దిగి, పక్కన నిలబడ్డాడు. అయితే, పక్కన నిలబడిన వారిని గమనించకుండా తాత్కాలిక డ్రైవర్ బస్సును కదిలించడంతో చంద్రశేఖర్‌ను ఢకొీంది. దాంతో ఆయన కిందపడగా, బస్సు టైరు కాలుపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. వెంటనే అతన్ని 108 సాయంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు.