Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'ఇదేమైనా టగ్‌ ఆఫ్‌ వారా' | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 16,2019

'ఇదేమైనా టగ్‌ ఆఫ్‌ వారా'

- సర్కారు, యూనియన్లకు హైకోర్టు ప్రశ్న
- 18కి విచారణ వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
'' ఇదేమైనా టగ్‌ ఆఫ్‌ వార్‌ ఆట అనుకుంటున్నారా.. పంతాలకు పోవడమేమిటో అర్ధం కావడం లేదు. పండుగ ముందు కార్మికులు ఆర్టీసి సమ్మెకు పిలుపు నివ్వడమేమిటో సమ్మె షురూ అయ్యాక సర్కార్‌ చర్చలకు పిలవకపోవడం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇదేమీ బ్రిటీష్‌ జమానా కాదు..'' అని ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వాన్ని, యూని యన్లను ఉద్దేశించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలవి. ఆర్టీసీ సమ్మె విరమించాలని, ఆ తర్వాత ప్రభుత్వం చర్చలు జరపాలని ఇరువురికీ హైకోర్టు సూచనలు చేసింది. ఆర్టీసీ సమ్మెను విరమిం చేలా ఆర్డర్‌ ఇవ్వాలంటూ ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ సుబేం దర్‌సింగ్‌ వేసిన పిల్‌ను మంగళవారం హైకోర్టు సీజే జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ సంద ర్భంగా ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యూనియన్లను ఉద్దేశించి పట్టుదలకు పోతే వచ్చే నష్టం మీకు కాదని, ఎర్రబ స్సెక్కే ప్రజలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
మంటలు మండుతుంటే చలి కాచుకునే తరహాలో ఉండకూడదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్య నించింది. చర్చలు జరపకుండా కాలయాపన చేయడం లేదా మొండికేస్తారా.. మీడియా వార్తల్ని చూస్తే ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు సమ్మె అనే ఆఖరి అస్త్రం ప్రయోగించినా ఫలితం లేకపోయిందా..? ఆర్టీసీ ఉద్యోగ, కార్మికుల
డిమాండ్లు న్యాయబద్ధం కావచ్చు. అయినా దసరా ముందు సమ్మెలోకి వెళ్లడం ఏమిటి ? ఎస్మా ప్రయోగిస్తే ఏమౌతుంది ? సమ్మె చట్ట వ్యతిరేకమని హైకోర్టు ప్రకటిస్తే మీ పరిస్థితి ఏమిటి ? ప్రజల ఇబ్బందులు పట్టవా. ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వమే కాదు యూనియన్లు చూడాలి.. అని అభిప్రాయపడింది.
ఎప్పుడో చేసింది ఇప్పుడు చెబుతారే...జడ్జి వ్యాఖ్య
విచారణ సందర్భంగా అదనపు ఏజీ కల్పించుకుని 2015లో ప్రభుత్వం ఆర్టీసీ ఆదాయంలో 44 శాతాన్ని ఫిట్‌మెంట్‌ ఇచ్చామని చెప్పగానే ఎప్పుడో చేసింది కాదని, ఇప్పుడు ఏం చేశారో చెప్పాలని హైకోర్టు కోరింది. ఆర్టీసి సమ్మె ప్రభావం ఏమీ లేదని, ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఏజీ బిఎస్‌ ప్రసాద్‌ చెప్పడంతో హైకోర్టు అసంతప్తి వ్యక్తం చేసింది. ఇబ్బందులే లేవన్నప్పుడు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు పొడిగింపు ఉత్తర్వులు ఎందుకిచ్చారని, ఇంకా 3 నుంచి 4 వేల బస్సులు నడవాలన్నప్పుడు ప్రయాణీకులకు ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఎట్లా ఉంటాయని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకూ 70 శాతం బస్సులు నడస్తున్నాయని, మిగిలివాటినీ త్వరలోనే నడిపిస్తామని అదనపు ఏజీ రామచందర్‌రావ్‌ చెప్పారు. ఇంకా 3 నుంచి 4 వేల బస్సులకు కండక్టర్లు, డ్రైవర్లు లేరు కదా, ఎలా తెస్తారని హైకోర్టు ప్రశ్నిస్తే.. తాత్కాలిక నియామకాలు చేస్తున్నామని ఆయన జవాబిచ్చారు. సమ్మె చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని యూనియన్‌ను ఉద్ధేశించి హైకోర్టు వ్యాఖ్యానించగా, తాము కేవలం ఆర్థిక అంశాలతో కూడిన డిమాండ్ల సాధన కోసం మాత్రమే సమ్మె చేయలేదని యూనియన్‌ తరఫు సీనియర్‌ లాయర్‌ ప్రకాష్‌రెడ్డి చెప్పారు.
నోటీసు ఇస్తే సర్కారు స్పందించలేదు..పర్మినెంట్‌ ఎండీ లేరు
నోటీసు ఇస్తే ప్రభుత్వం స్పందించలేదని, కార్మికులు తమ గోడును ఎండీ దగ్గర చెప్పుకునేందుకు పర్మినెంట్‌గా ఆర్టీసీకి ఎండీ లేరని గుర్తుచేశారు. ఎండీని ఎప్పటిలోగా భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వానికి తెలియజేస్తామని అదనపు ఏజీ చెప్పడంతో హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక ఐఎఎస్‌ అధికారిని ఎండీగా నియమించలేరా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోనందువల్లే శిశు కమిటీలు, సమాచార చట్టం కమిషనర్లు వంటి పోస్టుల్ని భర్తీ కోసం పలువురు హైకోర్టుకు వస్తున్నారని నిరసించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు గొంతమ్మ కోర్కెల్లా ఉన్నాయని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నారని, ఇదే కనుక అమలు చేస్తే ఇతర కార్పొరేషన్లు కూడా విలీనం చేయాలని కోరతాయని, అందుకే విలీనం డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చిందని అదనపు ఏజీ చెప్పారు. తాత్కాలిక నియామాకాలతో బస్సుల్ని నడిపితే ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషనర్‌ లాయర్‌ కష్ణయ్య చెప్పగానే, హైకోర్టు కల్పించుకుని అంత పెద్ద సంస్థలో అక్కడక్కడ జరిగే ప్రమాదాల గురించి పట్టించుకుంటే ఎలాగని ప్రశ్నించింది.
సమస్య వచ్చినప్పుడు సమర్థత బయటపడేది..డివిజన్‌ బెంచ్‌
సమస్య వచ్చినప్పుడే పాలకులు, అధికారుల సమర్ధత బయటపడుతుందని, పంతాలకుపోతే ప్రతిష్ట ఇద్దరిదీ పోతుందని డివిజన్‌ బెంచ్‌ తెలియజేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంలో సర్కార్‌, ఆర్టీసీ యూనియన్లు మొండి వైఖరుల్ని విడా లని సూచించింది. ఇప్పుడు మన ముందున్న సమస్య వారిద్దరిదీ కాదని, ప్రజల దని చెప్పింది. సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తే ఏం జరుగుతుందో, సమ్మె చట్ట వ్యతిరేక మని హైకోర్టు తేల్చితే ఏం జరుగుతుందో కూడా యూనియన్లు గుర్తెరగాలని హెచ్చరించింది. ఆర్టీసీ విలీనం ఒక్కటే సమస్య కాదని, ఆర్టీసీ ఆస్తులు, నిధుల సమస్యలు, ఉద్యోగుల పీఎఫ్‌ వంటి అంశాలు కూడా ఉన్నాయని మరో లాయర్‌ హైకోర్టు దష్టికి తీసుకొచ్చారు. దీనిపై హైకోర్టు కల్పించుకుని.. అన్నింటీకీ సమ్మె ఒక్కటే మార్గం కాదని, సమస్యల సాధన కోసం అనేక మార్గాలున్నాయని తెలిపిం ది. యూనియన్లు, ప్రభుత్వం పంతాలు వీడాలని, సమ్మె విరమించాలని, తర్వాత ప్రభుత్వం చర్చలు జరపాలని, ఏం చేశారో 18న జరిగే విచారణ సమయంలో చెప్పాలని హైకోర్టు కోరింది. ఇదే సమయంలో జీతాలు ఇచ్చేలా ఆర్టీసీ యాజ మాన్యానికి ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ వేసిన రిట్‌, దసరా సెలవుల్ని ప్రభుత్వం పొడిగించడాన్ని రద్దు చేయాలని తల్లిదండ్రుల సంఘం వేసిన మరో రిట్‌ను గురువారం హైకోర్టు సింగిల్‌ జడ్జిల దగ్గరకు విచారణకు వచ్చాయి. వీటిపై వాదనలు బుధవారానికి వాయిదా పడ్డాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాస్తవాలు చెప్పండి
యూనియన్లు వద్దనడం చట్టవిరుద్ధం
షీ టీమ్స్‌ ఉన్నా.. ఆగడాలు
అంతా గోప్యమే..
బృందాకరత్‌ పేరుతో అసభ్య పోస్టులు
మద్యం..మాంద్యంతోనే అనర్ధాలు
2020 నర్సింగ్‌ ఇయర్‌ : ఈటల
ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా ఆరోగ్యశ్రీ మేలు : ఈటల రాజేందర్‌
పోలీసులపై కేసులు
సైనిక కుటుంబాల సంక్షేమానికి సాయుధ దళాల పతాక నిధి : కల్నల్‌ రమేశ్‌ కుమార్‌
మద్యం అమ్మకాలను నియంత్రించాలి
పామాయిల్‌ సాగు తక్కువే
మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీక్‌..
రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌
11న రాష్ట్ర మంత్రివర్గం
రైతుబంధు, రుణమాఫీ అమలు చేయాలి
'ఉపాధి హామీ' కింద వైకుంఠధామాలు,
ఎక్స్‌గ్రేషియాను సులభతరం చేయాలి
స్కూల్‌ బస్సు కింద నలిగిన చిన్నారి
సమ్మె విజయం
వరంగల్‌ ఆర్జేడీ రాజీవ్‌ బదిలీ
గిరిజన ప్రాంతాల్లో.. భూబదలాయింపుపై కోర్టు
ఉపాధి హామీ కూలీల పని దినాలు 250కి పెంచాలి
గొర్రెల కాపర్లపై అటవీ అధికారులు దాడులు అరికట్టాలి: జీఎంపీఎస్‌
మృతుల కుటుంబీకుల ఆందోళన
సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలి
జనవరి నాటికి భగీరథ ఇంట్రా పూర్తి
డిస్కమ్‌లకు పలు అవార్డులు
వెల్ఫేర్‌ బోర్డుల వేగం పెంచండి
కార్యదర్శి పోస్టుల భర్తీ తీరును తప్పు పట్టిన హైకోర్టు

తాజా వార్తలు

10:01 PM

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

09:57 PM

నేను చచ్చిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త

09:51 PM

ఇంటికి చేరిన గాయని లతామంగేష్కర్

09:47 PM

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌

09:42 PM

ఒళ్లు గగుర్పొడిచే దారుణం..

09:31 PM

టీ20ల్లో విరాట్‌ కోహ్లీ మరో రికార్డు

09:06 PM

టీడీపీని నేను ఫినిష్ చేస్తానంటే జగన్ నవ్వుకుంటారు: కొడాలి నాని

08:59 PM

శ్రీనివాస్‌ రెడ్డిని కఠినంగా శిక్షించండి

08:51 PM

మనిషి ఆకృతిలో ఆకుపచ్చ పురుగు

08:50 PM

ముగిసిన భారత్‌ బ్యాటింగ్‌.. విండీస్‌ లక్ష్యం 171

08:32 PM

శాంసంగ్ నుంచి మరో రెండు గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్

08:32 PM

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

08:18 PM

కోహ్లీ అవుట్...15 ఓవర్లకు భారత్‌ 132/4

08:07 PM

రికార్డు స్థాయిలో మారుతీసుజుకీ వాహనాల అమ్మకాలు

07:56 PM

శివం దూబే అర్ద సెంచరీ.. అవుట్‌

07:48 PM

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌

07:44 PM

అరుణ్ శౌరీని పరామర్శించిన ప్రధాని మోడీ

07:40 PM

రోహిత్‌ శర్మ అవుట్..

07:38 PM

నెహ్రూ పెద్ద రేపిస్ట్.. సాధ్వీ ప్రాచి వివాదాస్పద కామెంట్లు

07:32 PM

ఎన్ కౌంటర్ ను సమర్ధించి తప్పు చేశా : సీపీఐ నారాయణ

07:20 PM

పదకొండున మంత్రివర్గ సమావేశం

07:19 PM

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

07:15 PM

భారీ భద్రత మధ్య ముగిసిన ఉన్నవో అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు

07:12 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదు : కమల్‌

07:02 PM

కుప్పంలో గజరాజులు బీభత్సం

07:00 PM

నదిలోకి దూకి యువతిని కాపాడిన పోలీసులు

06:57 PM

100కు కాల్‌ చేసిన యువతి.. వెంటనే స్పందించిన పోలీసులు

06:42 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

06:33 PM

బీఎండబ్ల్యూ నుంచి మరో కొత్త కారు

06:31 PM

నలుగురిని చంపినోడిని జైల్లోనే బతకనిస్తారా?: మందకృష్ణ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.