Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ కార్యాలయాల్లో దుమ్మెక్కుతున్న దరఖాస్తులు
- ఆసరా, బీడీ పింఛన్లకు రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూపులు
- పీఎఫ్ కటాఫ్ తేదీ సవరిస్తామని సీఎం హామీ..
- వయసు తగ్గిస్తామనే వాగ్దాన అమలుకు మీనమేషాలు
- అధికారుల చుట్టూ లబ్దిదారుల ప్రదక్షిణలు
'అయ్యా.. కొత్త పింఛన్లు ఎప్పుడొస్తయి?. 'అన్నా.. బీడీ కార్మికుల కొత్త పింఛన్లు మంజూరు చేస్తరా..?' ఇవీ ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా లబ్దిదారుల నుంచి వస్తున్న ప్రశ్నలు! పింఛన్ల వయస్సు తగ్గించినా.. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీ సవరించినా అవి అమలుకు నోచడం లేదు. ఇప్పటికే ప్రతి ఊళ్లో కనీసం 150 నుంచి 200 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి పంచాయతీ కార్యాలయంలో పత్రాలు సమర్పించగా.. ఏడు నెలలు కావొస్తున్నా కొత్త పింఛన్ల ఊసేలేదు. పెట్టుకున్న అర్జీ పత్రాలు కార్యాలయాల్లోనే దుమ్మెక్కుతున్నాయి. లబ్దిదారులు కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతుండగా.. దరఖాస్తులు తీసుకున్నాంగానీ ఏం చేయాలో అర్థం కావడం లేదనే సమాధానం కార్యాలయ సిబ్బంది నుంచి వస్తోంది.
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లను 2014 నుంచి, బీడీ కార్మికులకు జీవనభృతి 2015 నుంచి అమలు చేస్తున్నది. 65ఏండ్ల వయసుకుపైబడిన వారికి ప్రతి నెలా రూ.1000 ఇస్తున్నది. ఇటీవల దాన్ని రూ.2016కు పెంచింది. 2014 ఫిబ్రవరి 28లోపు పీఎఫ్ ఖాతాలున్న బీడీ కార్మికులకు జీవన భృతి కింద మొదట్లో రూ.వెయ్యి ఇవ్వగా.. దాన్నీ రూ.20 16కు పెంచింది. నిజామాబాద్ జిల్లాలో ఆసరా పింఛన ్‌దారులు 60వేలా 297, జీవనభృతి తీసుకుంటున్న బీడీ కార్మికులు 96వేలా 585 మంది ఉన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌తో పాటు పలు బహిరం గ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తూ ఆసరా అర్హుల వయస్సును తగ్గిస్తామనీ, పీఎఫ్ కటాఫ్ తేదీనీ సవరిస్తామనీ హామీని చ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 57 ఏం డ్లు నిండిన వారికి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వృద్ధాప్య పింఛన్లను అందజేస్తామని చెప్పారు. అందుకు సంబం ధించిన మార్గదర్శకాలూ సర్కారు విడుదల చేసింది. గత నవంబర్ 11న జారీ చేసిన తుది ఓటరు జాబితా ఆధారంగా 57-64 ఏండ్ల మధ్య వారిని జిల్లాలోని వీఆర్‌ఓ లు గుర్తించనున్నారు. చాలామంది లబ్దిదారులు ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు చేశారు. ఒక్కో వ్యక్తి జిరాక్స్‌ల కని, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుకని రూ.వందల్లో ఖర్చు చేసి అర్జీ పెట్టుకున్నారు. బీడీ కార్మికులకు గతంలో 2014 ఫిబ్రవరి 28 లోపు పీఎఫ్ తేదీ కటాఫ్‌గా ఉండగా.. ప్రస్తు తం 2019 ఆగస్టు వరకు కటాఫ్ తేదీ పొడిగించారు. లబ్దిదారులు ఎన్నో ఆశలతో దరఖాస్తులు చేశారు. అయి నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్జీలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. పంచాయతీల్లో ఈ దస్త్రాలు పెండింగ్‌లో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంగా ఉన్న కంజర్ గ్రామంలో మార్చి నెలలోనే 200 మంది వరకు లబ్దిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యాలయంలో అప్పగించారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ దరఖాస్తులను ఏం చేయాలో చెప్పే నాథుడు కరువయ్యాడు. పైనుంచి తమకేలాంటి ఆదేశాలూ రాలేదని అధికారులు అంటున్నారు. లబ్దిదారులు మాత్రం నిత్యం స్థానికంగా ఉండే సర్పంచ్‌ను, కార్యదర్శిని ప్రశ్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో దరఖాస్తులు తీసుకునేందుకు పంచాయతీ సిబ్బంది నిరాకరిస్తున్నారు. తమకు పైనుంచి ఎలాంటి ఆదేశాలూ లేవనీ, అలాంటి సమయంలో ఎలా తీసుకుంటామనీ బోధన్ మండలంలోని ఖండ్గం గ్రామ పంచాయతీలో నిరాకరిస్తున్నారు.
పింఛన్ కోసం ఎదురుచూస్తున్న
నా వయస్సు 59 ఏండ్లు. ఆసరా పింఛన్ కోసం ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్న. ఇప్పటివరకు రాలేదు. నా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. కనీసం గీ పింఛన్ వస్తే మందుల ఖర్చు బాధ తీరుతదని అనుకున్న. ఇంకా ఏం చెప్పలేదు. పంచాయతీల అడిగితే మా చేతుల్లో లేదంటున్నరు.
- రామర్తి పెద్దనర్సయ్య, కంజర్, మోపాల్