Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
హైదరాబాద్ బడంగ్‌పేట మున్సిపాలిటి పరిధిలోని మల్లాపూర్ గ్రామంలో డెంగ్యూతో ఓ బాలిక మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిప ిన వివరాల ప్రకారం.. మల్లాపూర్‌లో ఈశ్వర్- రమాదేవి దంపతుల కుమార్తె తేజస్వి ని(15) కాకతీయ స్కూల్‌లో 8వ తరగతి చదివేది. నాలుగు రోజుల నుంచి తేజస్వినికి జ్వరం రావటంతో స్థానికం గా ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గక పోవడంతో ఆర్‌ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చాడు. దాంతో బాలికకు వాంతులయ్యాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బాలాపూర్ చౌరస్తాలో ఉన్న ఓ ప్రయి వేటు ఆస్పత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహిం చి డెంగ్యూగా నిర్ధారించారు. ఆస్పత్రిలో అడ్మిట్ చేసే క్రమంలోనే పరిస్థితి విషమించి తేజస్విని మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఆర్‌ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే తన కూతురు చనిపోయిందని తండ్రి ఈశ్వర్ విలపించాడు.