Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరాశతో వెనుదిరిగిన కార్యకర్తలు
నవతెలంగాణ- హుజూర్‌నగర్
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో గురువారం జరగాల్సిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల నుంచి వచ్చిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపును కోరుతూ సీఎం కేసీఆర్‌తో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు గురువారం సభ ఏర్పాటు చేశారు. ఇందుకు కొన్ని రోజులుగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు ప్రణాళిక వేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, గాదరి కిషోరు, లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్‌తో పాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ఏడు మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సభ నిర్వహించి ప్రభుత్వ పథకాలు, నియోజక వర్గంలో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్టయితే పార్టీ అభ్యర్థిని సునాయాసంగా గెలిపించుకోవచ్చని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే వర్షం వల్ల కేసీఆర్ సభ రద్దు కావడంతో ఆ పార్టీ నాయకులకు నిరాశే మిగిలింది. నాలుగు రోజులు చేసిన ఏర్పాట్లు వృథా అయ్యాయి.