Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మెకు మద్దతుగా ప్రగతిభవన్ ముట్టడికి యత్నం
నవతెలంగాణ-ఓయూ
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ప్రగతిభవన్ ముట్టడికి బయల్దేరిన ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆర్ట్స్ కాలేజ్ నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్తుండగా ఎన్‌సీసీ గేట్ వద్ద వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పీఎస్‌కు తరలించారు. అంత కుముందు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థు లతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఇప్పటివరకు ఆర్టీసీ సమ్మెకు ఎలాంటి సహకారం అందించారో.. భవిష్యత్‌లో కూడా అదేవిధంగా సహకరించాలని కోరారు. ఆర్టీసీ పరిరక్షణకు అక్టోబర్ 19న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థులను ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ అశ్వత్థామరెడ్డి కోరారు. అయితే విద్యార్థులతో సమావేశమయ్యేందుకు వచ్చిన సందర్భంగా జేఏసీ నాయకులను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌వీ నాయకులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 24న ఆర్ట్స్ కళాశాల ఎదుట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పలువురు విద్యార్థి నాయకులు తెలిపారు.