Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పుట్టిన ప్రతీ వ్యక్తికి వృద్ధాప్యం తప్పదనీ, దాన్ని భారంగా భావించరాదని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య అన్నారు. రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యాన్ని ఒక వరంగా భావించాలని సూచించారు. 'ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ఎల్డర్స్ (ఫ్యామిలీ) ప్రపంచ ఉత్సవాలను నిర్వహించింది. ఇందులో సిని నటి జమునారమణారావు, రచయిత్రి లక్ష్మిపార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎల్డర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించడం, వారిని అన్ని విధాలుగా ఆదుకో వడం హర్షనీయమన్నారు. జమునా రమణారావు మాట్లాడు తూ వృద్ధాప్యం సహజమన్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారిని ఎల్డర్స్ క్లబ్ చేయూత నివ్వడం అభినందనీయమన్నారు. లక్ష్మి పార్వతి మాట్లాడుతూ వృద్ధాప్యాం అనేది మనిషికే కాని మనస్సుకా దన్నారు. సొంత వారే వృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తరుణం లో ఎల్డర్స్ క్లబ్ వారికి అండగా ఉండి సహాయ, సహకారాలను అందించడం విశేషమన్నారు.