Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చారుమజుందార్ శత జయంతి సదస్సులో ప్రొ.హరగోపాల్
నవతెలంగాణ-రాంనగర్
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. భారత విప్లవోద్యమ నేత చారుమజుందార్ శత జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. దేశం పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. ముఖ్యంగా రాజకీయాల్లో నిర్బంధం, నియంతత్వం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ సంక్షేమానికి, అనేక సమస్యల పరిష్కారానికి చారుమజుందార్ సిద్ధాంతాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఆయన ఆలోచనావిధానం, ఆయన ఇచ్చిన పరిష్కారాలు నేటికీ ఆదర్శనీయం అని కొనియాడారు. ప్రజాఉద్యమ చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. చారుమజుందార్ శతజయంతి జరపడం అంటే ఆయన విప్లవ పాత్రను ఎత్తిపట్టి నేటి తరానికి అందించడమే అని చెప్పారు. నక్సల్బరీ ఉద్యమం నాటికి ఆయన జిల్లా స్థాయి నాయకుడని, ఒక తరాన్ని పొలంలోకి నడిపించారని గుర్తు చేశారు. ప్రపంచ విప్లవ పరిణామాలను చాలా ముందుచూపుతో పసిగట్టారని కొనియాడారు. సదస్సులో ప్రొఫెసర్ సుబ్బారావు, డాక్టర్ శ్రీనివాస్, సీిఎస్‌ఆర్ ప్రసాద్, డాక్టర్ విజరు కుమార్, జి.కళ్యాణరావు, ఎన్.రవి, పద్మ కుమారి పాల్గొన్నారు.