Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదకర జీఓలను ఉపసంహరించుకోవాలి:
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి
నవతెలంగాణ - సంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.21వేలు అమలు చేయాలని తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్(టీచర్స్) అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదకర 14, 19, 8 జీఓలను వెంటనే ఉపసంహరించుకో వాలన్నారు. ఐసీడీఎస్ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని, కానీ నిర్వీర్యం చేయాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. యూనియన్ రాష్ట్ర మహాసభ ముగింపు సందర్భంగా ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడారు. ఆయాలకు, మినీలకు టీచర్లతో సమానంగా వేతనం ఇవ్వాలన్నారు. ఆరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న నిధులనే వెంటనే విడుదల చేయాలని కోరారు. పోషకాహారాన్ని సకాలంలో అందించాలని, బియ్యాన్ని రేషన్ షాపుల నుంచి కాకుండా నేరుగా సరఫరా చేయాలని అన్నారు. పిల్లలకు పోషకాహారం అందా లంటే ముఖ్యంగా పాలు, గుడ్లు నిరాటంకంగా సరఫరా చేయాలన్నారు. రాష్ట్ర మహాసభ విజయవంతమైందని, 29 జిల్లాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. రెండేండ్లుగా అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్య లపైనా, ఐసీడీఎస్ పరిరక్షణకు చేప ట్టాల్సిన కార్యక్ర మాలపైనా, రానున్న రోజుల్లో నిర్వహిం చనున్న పోరా టాలపైనా ఈ సభలో చర్చించినట్టు చెప్పారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పద్మ మాట్లాడుతూ.. అంగన్ వాడీల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరిష్కరిం చాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్దఎత్తున పోరాటాలు చేపడ తామని హెచ్చరించారు.