Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18న మండల, పట్టణ కేంద్రాల్లో నిరాహార దీక్షలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ పరిరక్షణోద్యమానికి మద్దతు తెలపాలని కోరుతూ మున్సిపల్, పట్టణ కేంద్రాల్లో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్టు సీఐటీ యూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు ప్రకటించారు. 18న అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టాలని సీఐటీయూ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్‌బేరర్ల సమావేశం హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ...తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికు లు 42 రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం అహంకారపూరితంగా వ్యవహ రించడం సరిగాదన్నారు. హైకోర్టు ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మందలించినా అప్రజాస్వామికంగా సీఎం ముందుకెళ్లడాన్ని తెలంగాణ సమాజం హర్షిం చదన్నారు. భేషజాలకు పోకుండా సమ్మె పరిష్కారానికి తక్షణం పూను కోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని తీవ్రం చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ఈ సమావేశం లో ఆర్. సుధాభాస్కర్, ఎస్.రమ, జె.వెంకటేష్, పాలడుగు భాస్కర్, భూపాల్, జె.మల్లిఖార్జున్, వంగూరు రాములు, బి.మధు పాల్గొన్నారు.