Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
ప్రపంచ జనాభాలో రెండోస్థానం ఉన్న భారతదేశం, అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని అభిప్రాయపడ్డారు. శనివారం మర్రిచెన్నారెడ్డి మానవనరుల అభివృద్ధి శాఖ ఆడిటోరియంలో టూరిజం, ఆర్కీయాలజీ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బౌద్ద పురావస్తుశాస్త్రంపై అంతర్జాతీయ సదస్సు తెలంగాణ బౌద్ధసంగతి-2019 ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ బౌద్ధమతంలో ఉన్న కొన్ని సూత్రాలనైనా పాటిస్తే అందరూ గొప్ప వారవు తారన్నారు. బౌద్దమతంలో పేర్కొన్న పలు జీవిత సత్యాలు మానవాళికి మేలు చేస్తాయని తెలిపారు. బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, టీఎస్‌టీడీసీ పన్యాల భూపతిరెడ్డి పాల్గొన్నారు.
సమన్వయంతో రోడ్లు నిర్మించాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
మారుమూల గ్రామాలకు రహదారులను నిర్మించేందుకు రోడ్లు భవనాలు, అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. పలు పాంత్రాల్లో రోడ్ల విస్తరణలో భాగంగా అటవీశాఖ అధికారులతో అభ్యంతరాలు వస్తున్నట్టు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి దృష్టికి తెస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు సోమవారం చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల రోడ్ల నిర్మాణంపై అరణ్యభవన్‌లో సమీక్ష నిర్వహించారు.