Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైద్యురాలు ప్రియాంకరెడ్డిని దారుణంగా హత్య చేసిన నిందితులను ఉరితీయాలంటూ ఖమ్మం జిల్లా వైరాలో వైరాలో డిగ్రీ విద్యార్థి మూడంతస్తుల భవనమెక్కి ఆదివారం హల్‌చల్ చేశాడు. ఆ దుర్మార్గులకు శిక్ష పడే వరకూ భవనం దిగనని ఐదు గంటల పాటు భీష్మించుకూర్చున్నాడు. వైరాకు చెందిన మట్టా రోహిత్ ఆదివారం తెల్లవారుజున 4 గంటలకు వారు నివాసముంటున్న భవనమెక్కాడు. ప్రియాంకారెడ్డి దారుణహత్యకు కారకులైన దుర్మార్గులను వెంటనే ఉరితీయాలనీ, వాళ్లకు శిక్ష పడే వరకు కిందకు దిగేదిలేదనీ, ఈ దుర్మార్గపు సమాజంలో తనకు బతకాలని లేదనీ ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వైరా ఎస్‌ఐ టి.నరేష్ చేరుకుని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వినకపోవడంతో కొందరు యువకులు చాకచక్యంగా భవనంపైకి ఎక్కి అతన్ని బలవంతగా కిందికి దించారు.