Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లంచం తీసుకుంటూ పట్టుబడిన కమిషనర్, ఆర్‌ఐ
నవతెలంగాణ-నర్సంపేట
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ ఎ.వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జి ఆర్‌ఐకె.కిరణ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణం నెహ్రూన గర్‌కు చెందిన కొక్కు అశోక్ అక్టోబర్ 30న బ్యాంకు రుణం కోసం తన ఇంటిపై బిల్డింగ్ ఏజ్ సర్టిఫికెట్ కోసం మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. కమిషనర్‌ను పలుమార్లు కలిసి తనకు సర్టిఫికెట్ కావాలని కోరగా ఇందుకోసం రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను ఇచ్చుకోలేని చెప్పినా వినక పోవడంతో నవంబర్ 29న వరంగల్ ఏసీబీ డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు సోమవారం కమిషనర్ వెంకటేశ్వరరావుకు బాధితుడు అశోక్ వెళ్లి తనవద్ద రూ.5వేలు మాత్రమే ఉన్నాయని ఇవ్వబోయాడు. ఆర్‌ఐ కిరణ్‌ను సంప్రదించాలని కమిషనర్ చెప్పాడు. మరో గదిలో ఉన్నా కిరణ్ వద్దకు వెళ్లి నగదును ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ మధుసూదన్, ఇన్‌స్పెక్టర్‌లు వాసాల సతీష్, క్రాంతికుమార్, రమణమూర్తి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.