Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9వ తేదీవరకు పోస్టుమార్టం చేయొద్దు
- రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశాలు
- ఎన్‌కౌంటర్ బూటకం : ప్రజాసంఘాలు
హైదరాబాద్ : చటాన్‌పల్లిలో దిశపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు ఎన్‌కౌంటర్ మృతిచెందిన వారి శవాలను ఈనెల 9 వరకూ భద్రంగా ఉంచాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్‌కౌం టర్ బూటకమనీ, ఇందుకు కారణమైన పోలీసులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మహి ళా హక్కులు, ప్రజాసంఘాలు సంయుక్తంగా హైకోర్టుకు ఫిర్యాదు చేశా యి. దీనిని సుమోటో పిల్‌గా భావించి శుక్రవారం రాత్రి న్యాయమూర్తులు జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. పోస్టుమార్టం సందర్భంగా తీసిన వీడియోను సీడీ లేదా పెన్‌డ్రైవ్‌లో ఉంచి మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జికి అందజేయాలనీ, వాటిని శనివారం హైకోర్టుకు నివేదించాలని పేర్కొంది.
సంఘాల ప్రతినిధులు సంఘమిత్ర, సజయ, పద్మజ షా, దేవి, జి.ఝాన్సీ, విమల, వి.సంధ్య, బి.విజయ, కేఎన్ ఆశాలత, సయ్యద్‌బిలాల్ ఇతరులు చేసిన ఫిర్యాదును పిల్‌గా చేసి విచారణ చేసింది. సర్కార్ తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ హాజరై వాదించారు. పాలమూరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ వైద్యుల బృందం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో జరిగిన పోస్టుమార్టాన్ని వీడియో కూడా తీస్తున్నారని తెలిపారు. అనంతరం డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలిచ్చి విచారణను 9కి వాయిదా వేసింది.
ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు
'ఆ నలుగురు పోలీసుల కస్టడీలో ఉన్నారు. వారి దగ్గర ఆయుధాలు ఏమీ లేవు. అప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నది కూడా కాదు. ముందుగా అదుపులోకి తీసుకున్న తర్వాత రోజు ఘటన జరిగింది. అంటే వాళ్ల దగ్గర ఆయుధాలు ఉండనే ఉండవు. వాళ్లను దిశ ఘటనాస్థలానికి తీసుకువెళ్లినప్పుడు తెల్లవారుజామున పోలీసులు 50 మంది వరకూ ఉన్నారు. అంత మంది పోలీసులున్నా ఆ నలుగురు ఎదురుతిరిగి పోలీసుల దగ్గర ఆయుధాల్ని ఎలా తీసుకోగలరనే సందేహాలు వస్తున్నాయి. పీయూసీఎల్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో 2014 సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఎన్‌కౌంటర్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలి.
వెంటనే హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వకపోతే మృతదేహాలకు హడావుడిగా పోస్టుమార్టం చేశామని చెప్పి అంత్యక్రియలు కూడా చేయించేస్తే ఆధారాలు చాలా వరకూ నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కస్టడీలో ఉన్న నిందితులకు సంకెళ్లు వేసే అవకాశం ఉంటుంది. జనం ఉద్వేగంతో వాళ్లను అప్పగిస్తే ఉరి తీస్తామని అంటే అందుకు అనుగుణంగా ఎన్‌కౌంటర్ చేశారనే అనుమానాలు ఉన్నాయి. పోలీసులపై హత్యానేరం కింద ఐపీసీలో 302 సెక్షన్ కింద కేసు పెట్టాలి. వాళ్లను అరెస్ట్ చేయాలి...' అని పిటిషన్‌దారులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.