Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ :మతోన్మాదులు, మనువాదులకు అంబేద్కర్‌ను కీర్తించే నైతిక హక్కులేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పుర స్కరించుకుని శుక్రవారం ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ మరోవైపు రాజ్యాంగాన్ని రచించిన మహనీయుని వద్ద మోకరిల్లడం సిగ్గు చేటన్నారు. విశ్వాసాలు, మూఢన మ్మకాల పునాదిపై బీజేపీ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులకు ఏమాత్రం రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.గతం కంటే 20 శాతం దాడులు అధికంగా పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెరు గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్ మాట్లాడుతూ రాజ్యాంగం తో బీజేపీ నాటకాలు ఆడుతున్నదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసినప్పుడు దళితుల్లో పెరిగిన ఐక్య ప్రతిఘటనతో కేంద్రం తోకముడి చిందని విమర్శించారు. రాష్ట్రంలో దళితుల కు ఇచ్చిన వాగ్ధానాలు అమలు కావడం లేదనీ, ట్యాంక్ బండ్‌పై 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన సర్కారు..పంజాగుట్టలో ఉన్న విగ్రహాన్ని కూల్చారని విమర్శించారు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షు లు నందిపాటి మనోహర్, మాణిక్యం, రాష్ట్ర కమిటీ సభ్యులు జి లక్ష్మణ్, శ్రీనివాస్, విద్యాసాగర్, నగర అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, విజరుకుమార్, దశరథ్ పాల్గొన్నారు.