Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ నగరంలో తొమ్మిది నెలల చిన్నారిపై లైంగికదాడి, హత్య ఘటన నిందితుడు పోలెపాక ప్రవీణ్‌కు శిక్ష తగ్గింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించ నున్న ట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది నెలల చిన్నారిపై లైంగిక దాడి అనంతరం హతమార్చిన ప్రవీణ్‌కు మరణశిక్ష విధిస్తూ గతంలో వరంగల్ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో.. కేసు పూర్వా పరాలను పరిశీలించిన హైకోర్టు ప్రవీణ్‌కు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదీగా సవరిస్తూ తీర్పు ఇచ్చింది. దాంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు.