Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- మృతురాలి కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ-వరంగల్, నయీంనగర్
మానస హంతకులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ హంటర్ రోడ్డులోని దీన్‌దయాల్‌నగర్‌లో హత్యాచారానికి గురైన మానస కుటుంబాన్ని సోమవారం తమ్మినేని పరామర్శించారు. తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మానస తండ్రి మల్లయ్య కాలువిరిగి మంచాన నిస్సహాయ స్థితిలో ఉన్నాడని, కూతురిని పోగుటు ్టకున్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించు కోకపో వడం బాధాకరమని అన్నారు. మాసన ఘటనలో ముగ్గురిని కీలక నిందితులుగా గుర్తించిన పోలీసులు ఒక్కరినే అరెస్టు చేసి కీలక ముద్దాయిగా పేర్కొనడం సరైంది కాదన్నారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరించకుండా విచారణ చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఈ ఘటనకు పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడేలా చూడాలని కోరారు. వెనుకబడిన తరగతికి చెందిన యువతి కాబట్టే మానస నిందితులను శిక్షించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకొని దోషులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనట్టయితే వామపక్షాలు, సామాజిక సంఘాలతో కలిసి పెద్దయెత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తమ్మినేని వెంట సీపీఐ(ఎం) నాయకులు జి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. కాగా దిశ నిందితుల తరహాలోనే మానస నిందితు లనూ కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డికె.అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల వరంగల్‌లో లైంగికదాడి, హత్యకు గురైన మానస కుటుంబాన్ని సోమవారం బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు రావుపద్మతో కలిసి పరామర్శించారు.