Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రోగులు పెరిగినా ఎంఎన్‌జే ఒక్కటే దిక్కు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

రోగులు పెరిగినా ఎంఎన్‌జే ఒక్కటే దిక్కు

- పాతికేండ్లలో అధికమైన క్యాన్సర్‌ బాధితులు
- రీజినల్‌ సెంటర్ల ఏర్పాటులో జాప్యం
- ప్రయివేటు దోపిడికి గురవుతున్న రోగులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై ప్రభుత్వాలు అవగాహన కల్పించకపోవడంతో క్యాన్సర్‌ రోగుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నది. గత పాతికేండ్లలో పెరిగిన రోగుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తున్నది. 1990లో ఒక లక్ష మంది జనాభాలో 54 మంది క్యాన్సర్‌ రోగులుండే వారు. ప్రస్తుతం ఇది 72కు పెరిగినట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అయితే పెరిగిన రోగుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రభుత్వపరంగా చికిత్స కోసం మాత్రం పెరగడం లేదు. రాష్ట్రంలో ఏకైక ఎం.ఎన్‌.జే.క్యాన్సర్‌ ఆస్పత్రి మాత్రమే అందుబాటులో ఉండడంతో రోగులకు మెరుగైన సౌకర్యాలను అందించలేకపోతున్నది. దీంతో రోగులు అనివార్యంగా ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీకి గురవుతున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యను గమనంలోకి తీసుకున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు పోటాపోటీగా క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేక విభాగాలను ప్రారంభించి, ఒక్కో రోగి నుంచి లక్షలాది రూపాయలను సంపాదించుకుంటున్నాయి. క్యాన్సర్‌పై కార్పొరేట్‌ ఆస్పత్రుల టర్నోవర్‌ ఏడాది వందల కోట్ల రూపాయల్లో ఉంటున్నదని విశ్లేషకులు అంచనా. కీమోథెరపీ దశకు చేరుకున్న క్యాన్సర్‌ రోగులకు ఒక్కొక్కరికి తక్కువలో తక్కువగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి. దీనిని భరించలేని పేద రోగులు ఎక్కువగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను ఆశ్రయిస్తున్నా, అక్కడ కూడా సగానికి మించి ఆర్థిక సాయం అందడం లేదు. దీంతో మిగిలిన వాటి కోసం రోగులు అప్పులపాలవుతున్నారు. గుండెజబ్బుల తర్వాత రోగాలతో మరణించేవారిలో క్యాన్సర్‌తో మరణాలే ఎక్కువగా ఉంటున్నట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఇటీవల విడుదల చేసిన అధ్యయన ఫలితాల్లో వెల్లడైంది. క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన లేకపోవడంతో ఎక్కువ మందిలో క్యాన్సర్‌ ఉన్నట్టు ఆలస్యంగా బయటపడుతున్నట్టు కూడా ఆ అధ్యయనం గుర్తించింది. దీనిని గుర్తించిన తర్వాత పలువురు రోగులు ప్రభుత్వం ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లినప్పటికీ అక్కడ సౌకర్యాలలేమి కారణంగా ప్రయివేటు ఆస్పత్రులకు వెళుతున్నప్పటికీ అక్కడ ఖర్చులను భరించడం వారికి భారంగా మారుతున్నది. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఇక్కడ సిబ్బంది, సౌకర్యాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. నిమ్స్‌తో పాటు ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని మినహాయిస్తే మిగిలిన ఆస్పత్రులన్ని కార్పొరేట్‌వే కావడం ఆ రోగుల పాలిట శాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వస్తే 1990లో ప్రతి లక్షకు 58 మందిగా ఉన్న రోగుల సంఖ్య కాస్తా 76కు పెరిగింది. దేశవ్యాప్తంగా 1990లో 5,48,000 మంది రోగులు పెరిగి 10,69,000కు పైగా పెరగడం క్యాన్సర్‌ తీవ్రతకు అద్దం పడుతున్నది. మన రాష్ట్రంలో ఉదర క్యాన్సర్‌ ఎక్కువగా ఉండగా ఆ తర్వాత వరుసగా బ్రెస్ట్‌, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌కు ఎక్కువగా గురవుతున్నారు.
సేకరణతో సరి......
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రోగుల వివరాలను సేకరిస్తుంటాయి. నాన్‌ కమ్యూనికబుల్‌్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) రోగుల వివరాలను క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకుంటూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తమ వద్ద అట్టిపెట్టుకుంటాయి. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందికి రోగ లక్షణాలపై శిక్షణ ఇచ్చి అలాంటి అనుమానితుల గుర్తింపును చేపడుతున్నాయి. సేకరించిన వివరాల మేరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో మాత్రం రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, క్యాన్సర్‌ నియంత్రణ జాతీయ కార్యక్రమంలో భాగంగా వరంగల్‌లో ఒక ప్రాంతీయ క్యాన్సర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని, అదే విధంగా మరో చోట అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. దీనికి ఆమోదం లభించడంలో జాప్యం జరుగుతుండడంతో పేదరోగులకు ఇబ్బందికరంగా మారింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పోరాటమే...
సుప్రీం తీర్పు వెనుక దురుద్దేశం
దళితుల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు
సామాజికంగా, ఆర్థికంగా ఎదిగితేనే వివక్ష అంతం : మల్లు లక్ష్మి
మహనీయుల మార్గదర్శి కేవీపీఎస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
స్టే కాదు.. చట్టాలను రద్దు చేయాలి
ఓయూలో కాంట్రాక్టర్‌ ధనదాహం!
గిరిజన సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాల కాపీలు దహనం
వరి ఎక్కువగా పండే జిల్లాల్లో డ్రై పోర్టులు
రైతు వ్యతిరేక చట్టాల్ని తిప్పికొట్టాలి
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం క్యూ లైన్‌
కార్పొరేట్‌ విద్యలో విలువలు ఉండవు
సంక్రాంతికి పట్నం వాసులు పల్లెబాట
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండి
నిజామాబాద్‌లో కోళ్లు మృత్యువాత
బావిలో చిరుత
జిల్లాలకు తరలిన వ్యాక్సిన్‌
ప్రజలకు గవర్నర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
అన్ని తరగతులనూ ప్రారంభించాలి : టీపీఏ
ఇంటర్‌ విద్యలో అక్రమాలపై చర్యలు తీసుకొండి
28 ప్రభుత్వాస్పత్రుల్లో పేషెంట్లు నిల్‌
మెక్‌టెక్‌ సంస్థ రూ.5 కోట్లను ఇచ్చేయండి
పెరుగనున్న చలి తీవ్రత
రైతుల పాక్షిక విజయం..
ఆ చట్టాలు దుర్మార్గం..
రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌
గోస పట్టేనా?
గ్రేటర్‌ వాసులకు నీటి కష్టాలుండవ్‌
కల్తీకల్లు, మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టాలి
కళతప్పిన సంక్రాంతి

తాజా వార్తలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

11:23 AM

పేస్ బౌలింగ్‌తో రోహిత్ శ‌ర్మ స‌ర్‌ప్రైజ్

10:58 AM

పెను విషాదం..సముద్రంలో కుప్పకూలీన విమానం

10:40 AM

17 మంది ఎస్ఐలకు స్థానచలనం

10:32 AM

అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ .. బైడెన్‌ కీలక ప్రతిపాదన

10:12 AM

ఇండోనేసియాలో భారీ భూకంపం.. ఏడుగురు మృతి

09:55 AM

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

09:42 AM

కామారెడ్డిలో విషాదం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.