Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టడంపై ఆవాజ్ ఆందోళన
- అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పౌరసత్వ సవరణ బిల్లు-2019 (ఎన్నార్సీ) రాజ్యాంగ విరుద్ధమని ఆవాజ్ (ఏ ఫోరం ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీస్) విమర్శించింది. బీజేపీ సర్కారు పౌరసత్వాన్ని మతంతో ముడి పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్రం తన మందబలంతో లోక్‌సభలో ఆమోదింప చేసుకోవడాన్ని ఖండించింది. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ మంగళవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసింది. ఎన్నార్సీ వాపస్ లేవో, బీజేపీ సర్కారు హోష్ మే ఆవ్, సేవ్ నేషనలిజం, బీజేపీ, ఎన్టీయే, ఆర్‌ఎస్‌ఎస్ డౌన్, డౌన్ అంటూ నాయకులు, కార్య కర్తలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద, ప్రజా స్వామ్య, గణతంత్ర వంటి మూ ల సూత్రాలను బీజేపీ తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆవాజ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ, మహమ్మద్ అబ్బాస్ మాట్లాడు తూ దేశ సమైక్యతకు, సమగ్రత కు ప్రమాదం వాటిల్లేలా, ప్రజల మధ్య మత విభజన సృష్టించే ఈ బిల్లును అందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో వలసలను ప్రోత్సహించేలా ఈ బిల్లు ఉందని విమర్శించారు. ఇప్పటి క ఈశాన్య రాష్ట్రాలు వలసలతో ఇబ్బందులకు గురౌవుతుంటే, దేశ వ్యాప్తంగా ఈ సమస్యను రుద్దాలని ప్రయత్నిం చడం దారుణమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 నుంచి 11 వరకు పౌరసత్వానికి సంబంధిం చిన వివరణ ఎక్కడా లేదని గుర్తు చేశారు. పౌరసత్వం విషయంలో మత విశ్వాసాలు పరిగణనలోకి తీసుకుంటు న్నట్టుగా రాజ్యాంగంలో పేర్కొనలేద న్నారు. ఇప్పటి వరకు జరిగిన పౌరసత్వ చట్టం సవరణలో ఎప్పుడు కూడా మతం ప్రాతిపదికగా సవరణలు జరగలేదని అభిప్రాయపడ్డారు. ఎవరికైనా పౌరసత్వం ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం విచక్షణ ప్రకారం ఇప్పటికే ఉన్న చట్టాలకు అనుగుణంగా ఇవ్వవచ్చని తెలిపారు. కానీ కొన్ని మతాలకు దీనిని పరిమితం చేయాలని చూడటం సరైందికాదని తెలిపారు. దేశ ప్రజల మధ్య మత చిచ్చు పెట్టడానికి దారి తీసే ప్రమాదముందని హెచ్చరించారు. దేశంలో మత కుంపట్లు రాజేసీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. సోషలిస్టు పార్టీ అధ్యక్షురాలు లుబ్న సర్వత్ మాట్లాడుతూ ఎన్నార్సీపై శాస్త్రీయ అధ్యయనం చేశారా? చేస్తే ఆ వివరాలు బహిర్గ తం చేయాలని డిమాండ్ చేశారు. పౌరసత్వం కావాలని ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో చెప్పలేదని విమర్శించారు. నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు, మైనార్టీలు, దళితులపై దాడులతోపాటు అనేక సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ సర్కారు ఎన్నార్సీ బిల్లును ప్రజల ముందుకు తెచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేసి ప్రతి పౌరుడికి ఆధార్‌కార్డు ఇచ్చిందనీ, ఈ సందర్భంగా ఆ కార్డులను ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఆర్ అధ్యక్షులు ఎండీ అప్జల్, మైనార్టీ రైట్ ప్రొడక్షన్ నేత మహ్మద్ అబ్దుల్ అలీ, నాయకులు ఎండీ రజాక్, ఎండీ ఇఫ్తెఖార్, అబ్దుల్ సత్తార్, ఎల్ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.