Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కాశీబుగ్గ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మూడేండ్ల కిందట ఏర్పాటు చేసిన మద్దతు ధర పట్టిక బోర్డును అధికారులు ఎట్టకేలకు మంగళవారం మార్చారు. సోమవారం మార్కెట్‌ను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించిన విషయం విదితమే. మార్కెట్ గేట్ ప్రాంతంలో మూడేండ్ల కిందట ఏర్పాటు చేసిన సీసీఐ ధరల పట్టికపై మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య,సీసీఐ అధికారి రవీందర్‌రెడ్డిని తమ్మినేని నిలదీశారు. దీంతో అధి కారులు స్పందించారు. ప్రస్తుత మద్దతు ధర పట్టిక బోర్డును ఏర్పాటు చేశారు. రైతు సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, సొండే టి బాబు, సోమిడి శ్రీనివా స్ మంగళవారం మార్కెట్‌కు వెళ్లి ధరల పట్టిక ను పరిశీలించారు. ఈ సందర్భం గా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ.. రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ అవర ణలో రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రైతులను చైతన్య పరు స్తూ, మార్కెట్‌లో జరిగే రైతు వ్యతిరేక విధానాలను బట్టబయలు చేస్తామన్నారు