Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ వాయిదా
నవతెలంగాణ- హైదరాబాద్
దిశ నిందితుల ఎదురుకాల్పుల్లో చనిపోయిన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవుల మృతదేహాలను సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడే వరకూ గాంధీ ఆస్పత్రిలో జాగ్రత్తగా భద్రం చేయాలని హైకోర్టు తెలంగాణసర్కార్‌ను ఆదేశించింది. ఎన్‌కౌంటర్ బూటకమని దాఖలైన పిల్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి డివిజన్ బెంచ్ విచారించింది. మృతదేహాల విషయంపై
సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసుకునే నిమిత్తం గురువారం నాటి విచారణ శుక్రవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. మృతదేహాల్ని జాగ్రత్తగా భద్రం చేయాలని సుప్రీం చెప్పినట్టుగా అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ బెంచ్ దృష్టికి తెచ్చారు. గాంధీలో మృతదేహాలను భద్రంగా ఉంచాలని ఆదేశించిన హైకోర్టు విచారణను నిరవధికంగా వాయిదా వేసింది.