Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమయపాలన బేఖాతర్
- అందుబాటులో డ్రగ్స్
- యువతుల అక్రమ రవాణా కూడా
- చోద్యం చూస్తున్న పోలీసు యంత్రాంగం
- యాజమాన్యాలకు రాజకీయ అండదండలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొన్ని నెలలుగా రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు మితిమీరాయి. కేవలం తొమ్మిది నెలల్లో 11 మంది హత్యకు గురయ్యారు. లైంగిదాడులకు గల కారణాలపై దృష్టి పెట్టడం లేదు. పోలీసులు మాత్రం కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన లైంగికదాడులన్నీ మద్యం మత్తులోనే జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. గత 15 రోజుల క్రితం 'దిశ' ను తాగిన మత్తులోనే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పిన విషయం విధితమే. వెల్లడించారు. అయి నా రాష్ట్రంలో మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా, పబ్‌లు, బార్లు, మద్యం షాపులను అర్ధరాత్రి వరకు అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. మద్యం మత్తులో యువత బలవుతుంటే.. సర్కారు మాత్రం ఖజానా నింపు కోవడానికే ప్రాధాన్యతనిస్తున్నది. అడ్డదారులు తొక్కుతున్నది.
అక్రమాలకు అడ్రస్
రాజధాని పరిధిలో ఉన్న పబ్‌లు అసంఘిక కార్యా కలాపాలకు అడ్రస్‌గా మారుతు న్నాయి. వీటిని అసాంఘిక శక్తులు తమ కార్యకలాపాలకు కేంద్రాలుగా వాడుకుంటు న్నాయి. ప్రధానంగా మాదక ద్రవ్యాలతో పాటు, యువతుల అక్రమ రవాణా తతంగం అంతా పబ్‌ల్లోనే జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పబ్‌లకు వచ్చే యువకులకు వాటి యాజమా న్యాలే యువతులను సైతం అందుబాటు లోకి తెస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. పబ్‌లపై పోలీసుల నిఘా లేకపోవడం, డబ్బులు ముట్టచెప్పితే అక్కడి యాజమాన్యం ఏం చేసినా పట్టించు కోకపోవడంతోనే నేరాలు అధికమవుతు న్నాయి. తాగిన మత్తులో యువతులను వేధించడం, లైంగికదాడులకు పాల్పడటం తదితర సంఘటనలు చోటు చేసుకుంటున్నా, వెలుగులోకి రాకుండా పబ్‌ల యాజ మాన్యాలు మేనేజ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రిం బవళ్లు పబ్‌లను నిర్వహిస్తున్నా పోలీసులు చోద్యం చేస్తున్నారే తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మద్యం కోసం అర్ధరాత్రి వేళలలో కూడా యువ తులు పబ్‌లోకి వెళ్లడం, ఫూటుగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టు పడుతున్నా పోలీసులు దృష్టి సారించడం లేదు. వీటి నిర్వా హకులకు రాజకీయ అండదండలు ఉండటంతో పోలీసులు చూసీచూడనట్టు వ్యవ హరిస్తున్నారు.
గత పది రోజుల క్రితం మాదాపూర్‌లోని నోవాటెల్ పబ్‌లో ఓక సినీ నటితో మాజీ ఎమ్మెల్యే కుమారుడు తాగిన మైకంలో దురుసుగా ప్రవర్తించినట్టు ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పబ్‌లో జరుగుతున్న అనేక అఘాయిత్యాలు, అరాచకాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. వీటిని అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతున్నది. సంఘవిద్రోహ శక్తులపై ఫిర్యాదులు అందగానే కాస్త హడావుడీ చేసి తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పబ్‌లు, బార్లపై నిరంతర నిఘా పెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పబ్‌ల లైసెన్స్‌లను రద్దు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పబ్‌లపై ఆ తరహా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
కోట్లలో ఆదాయం
పబ్‌లకు ఇచ్చే అనుమతులతో రాష్ట్ర ప్రభు త్వానికి ఏడాదికి రూ. 200 కోట్ల ఆదాయం వస్తున్నది. యాజ మాన్యాలు కూడా కోట్లలో లాభాలు గడి స్తున్నాయి. పబ్‌లు, బార్లలో ఎంట్రీ ఫీజులు లేకపోయిన ప్పటికీ మద్యం ప్రియుల నుంచి సుమారు రూ. 1000 సిట్టింగ్ ఫీజు కింద వసూలు చేస్తు న్నారు. దీనిపై పోలీసులు, ఎక్సైజ్ అధి కారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదు.
నగర పరిధిలో 100 పబ్‌లు
హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో సుమారు 100 వరకు పబ్‌లు ఉన్నట్టు సమాచారం. ఇందులో అధికంగా బంజారాహిల్స్, జుబ్లిహిల్స్ ప్రాంతాల్లోనే సుమారు 50 వరకు ఉండగా, మాదాపూర్, కొండా పూర్, నగర శివారుల్లో మరో 50 పబ్‌లు ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి రాజధాని పరిధిలో ఎన్ని పబ్‌లు ఉన్నాయనే సమాచారాన్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మాత్రం చెప్పడం లేదు. పబ్‌ల వ్యవ హారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పబ్‌ల యాజ మాన్యాలు వారికి భారీ మొత్తంలో ముడుపులు అందిస్తున్నారనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి.