Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే జీఎంతో సీఎస్ భేటీ
- కొత్తపల్లి, మనోహరబాద్‌తో సహ పలు ప్రాజెక్ట్‌లపై చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ దక్షణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాతో సోమవారం రైల్ నిలయంలో భేటీ అయ్యారు. 2014లో రాష్ట్ర ఏర్పాటు సమయంలో రైల్వేల విస్తరణ, అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలు పలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు ప్రతి ఏటా బడ్జెట్ సందర్భంలో రాష్ట్రానికి కేటాయించిన పలు పనులు సైతం ఇంకా అమలు నోచుకోలేదు. వీటిని వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు సైతం పలు సందర్భాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తున్నా అమలు కు నోచుకోవడం లేదు. సీఎస్‌గా కొత్తగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన రైల్వే అధికారులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాన్ని కలిపే కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ రైల్వే లైన్ పను లు వేగవంతం చేయాలని సీఎస్ రైల్వే అధికారులను కోరినట్టు సమాచారం. పాండురంగాపురం నుంచి సారపాక, సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్, గద్వాల నుంచి రాయచూర్ వరకు రైల్వే లైన్లను విస్తరిం చాలనే డిమాండ్ పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే పటాన్‌చెరువు నుంచి సంగారెడ్డి, జోగిపేట నుంచి, మెదక్, నిజామాబాద్ నుంచి నిర్మల్ వరకు కొత్త రైల్వే లైన్లు ఏర్పాటుపై ఇరువురి మద్య ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తున్నది. కాగా ఇందులో పలు పనులు చేపట్టేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నప్పటికి రాష్ట్రం మం దుకు రావడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్ట్‌లకు సంబంధించి చెల్లించాల్సిన వాటా చెల్లించక పోవడం వల్లే ప్రాజెక్ట్‌లు పరుగులు పెట్టడం లేదని దక్షిణమధ్య్య రైల్వే అధికారులు పలు సందర్భాల్లో పేర్కొనడం గమనార్హం.
ఎస్‌బీఐతో దక్షిణమధ్య రైల్వే ఒప్పందం
రోజూ వారీ ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి స్టేట్ బ్యంక్ ఆఫ్ ఇండియాతో జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సమక్షంలో దక్షిణమధ్య రైల్వే సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రైల్వే రవాణా సేవల మేనేజర్ డాక్టర్ బీఎస్ క్ట్రిష్టఫర్, ట్రాఫిక్ ఛీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ జె.మేఘనాధ్, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేంద్ర నాయక్ ఒప్పందంపై సంతకాలు చేశారు.