Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సర్కారుకు కాసులు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 14,2020

సర్కారుకు కాసులు..

- మున్సిపల్‌ ఎన్నికల్లో మద్యానిదే హవా
- వారంలో రూ.300 కోట్లు అమ్మకం
- రెబెల్స్‌తో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లలో అలజడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను గలగలాడి స్తుండగా, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీకి మాత్రం చికాకు తెప్పిస్తు న్నది. సర్కారు సంతోషంలో ఉంటే, ఈ మూడు పార్టీలు మాత్రం నానాతంటాలు పడుతున్నాయి. మద్యాన్ని ప్రొత్సహిం చడం ద్వారా ప్రజల సొమ్మును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుంటే, రెబల్‌ అభ్యర్థులతో కాంగ్రెస్‌ , అసలు అభ్యర్థులే దొరకక బీజేపీ అవస్థ పడుతున్నాయి. టీడీపీ నామమాత్రపు పోటీకి సిద్ధమైంది. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వందల కోట్లను మూటకట్టుకుంటున్నది. పోటీచేసే అభ్యర్థులు కోట్లాది రూపాలయలు ఖర్చుపెడుతూ మున్సిపాల్టీల్లో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారు.
''అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుపిల్ల కాదేది కవితకనర్హం అన్నట్టు'' రాష్ట్రంలో పెండ్లిళ్లు, చావులు, పండుగలు, కొత్త సంవత్సరం వేడుకలు, ఎన్నికలు, ప్రచారాలు, కౌంటింగ్‌ ఏదైనా సరే మద్యం ఉండాల్సిందే. గత డిసెంబర్‌లో కొత్త సంవత్సరం వేడుకలకు కేవలం రెండు రోజుల్లో రూ. 500 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే, ఆ తర్వాత కేవలం 15 రోజుల వ్యవధిలోనే మున్సిపల్‌ ఎన్నికలు, సంక్రాంతి పండుగ రావడంతో మరో రూ. 300 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. ఇందులో రూ. 200 కోట్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే కొనుగోలు చేసినట్టు అనధికారిక సమాచారం. మరో రెండు రోజుల్లో ఈ మొత్తం రూ. 400 కోట్లకు చేరే అవకాశమున్నట్టు ఆబ్కారీ శాఖ అధికారులు భావిస్తున్నారు.
డబుల్‌ ధమాకా
సంక్రాంతి సంబురాలు, మున్సిపల్‌ ఎన్నికలు ఒకే నెలలో రావడంతో సర్కారుకు డబుల్‌ ధమాకా తగిలింది. పండుగను పురస్కరించుకుని భారీగా మద్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో మున్సిపల్‌ ఎన్నికల వేడీ తగలడంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో ఓటర్లను ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన రోజు నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావావరణం వేడెక్కింది.
సీసా మీకు.. ఓటు నాకు
ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఓటర్లకు ఇప్పటి నుంచే మందు బాటిళ్లు సరఫరా చేస్తున్నారు. మద్యం సేవించే వారి వివరాలను తీసుకుని వారికి మందు బాటిళ్లు అందిస్తున్నారు. మీ ఓటు నాకే వేయాలంటూ కోరుతున్నారు. ఇంట్లో ఓటర్ల సంఖ్యను బట్టి ఒక్కో ఇంటికి మూడు నుంచి నాలుగు బాటిళ్ల మందు చేరవేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఒక్కో వార్డులో నలుగురైదుగురు పోటీ పడుతూ భారీగా మద్యం కొనుగోలు చేస్తున్నారు. కాగా మద్యం పంపిణీలోనూ తేడా కనిపిస్తున్నది. కాస్తా పలుకుబడి గలిగిన ఓటర్లకు ఖరీదైన మద్యాన్ని సరఫరా చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా ..
గత అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా మున్సిపల్‌ ఎన్నికలను అభ్యర్థులు సవాల్‌గా తీసుకున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే పోటీ పడుతుండటంతో ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రధానంగా వీరంతా తమ భవితవ్యం మద్యం మీదే ఆధారపడిందనే భావనలో ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీగా మద్యం కొనుగోళ్లు జరుగుతున్నట్టు సమాచారం.
'స్థానిక' బుజ్జగింపులకు ససేమిరా
చావో ...రేవో అన్నట్టుగా తయారైన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిని రెబల్స్‌ బెడద మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. వరుస ఎన్నికల్లో వైఫల్యాలతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీ, తాజా ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాల్సిన దుస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తర్వాత పార్టీగా రాష్ట్రంలో నిలబడింది. అయితే ఎంపీ ఎన్నికల నాటికి ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా మూడు సీట్లు గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది. తాజాగా 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికే టీపీసీసీ మున్సిపాల్టీల వారీగా పర్యవేక్షకులను వేయడంతో పాటు స్థానిక మ్యానిఫెస్టోతోపాటు రాష్ట్ర స్థాయి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అయితే ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేయాల్సిన సమయంలో 3052 వార్డులకుగాను 5365 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే రెబల్స్‌ను బుజ్జగించే బాధ్యతను పార్టీ ఇప్పటికే స్థానిక నేతలకు అప్పగించిన సంగతి తెలిసిందే. డీసీసీ అధ్యక్షులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకు అప్పగించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే లేని ప్రాంతాల్లో ఆ బాధ్యతను మాజీలు చూస్తున్నారు. రెబల్స్‌ను గుర్తించి స్థానికంగా బుజ్జగిస్తున్నప్పటికీ మరికొంత మంది రాష్ట్ర నాయకత్వం హామిని కోరుతుండడంతో పార్టీ ప్రచారం కన్నా రెబల్స్‌ను తప్పించేందుకు ఎక్కువ సమయమిస్తున్నారు.ముఖ్యంగా పార్టీకి గెలుపు అవకాశాలున్న దక్షిణ తెలంగాణలో రెబల్స్‌ బెడద ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ ఎంపీలు ప్రాతినిథ్యం ఉన్న మల్కాజ్‌గిరి, నల్లగొండ, భువనగిరితో పాటు చేవెళ్ల, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి తదితర పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సమస్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు. స్థానికంగా బుజ్జగింపులకు లొంగని వారిని గుర్తించి రాష్ట్ర నాయకులే బుజ్జగిస్తున్నట్టు సమాచారం. పార్టీకి విశ్వసనీయతగా ఉంటే భవిష్యత్తుకు తమది భరోసా అని హామి ఇచ్చి విరమింపజేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలతో నామినేషన్లను ఉపసంహరించుకునేం దుకు తుది గడువు కావడంతో స్థానికంగా విఫలమైన వారిని గుర్తించి విరమింపజేసేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ఏ మేరకు రాష్ట్ర నాయకత్వం బుజ్జగింపులు పని చేశాయనే విషయం మంగళవారం తేలనుంది. ఇదిలావుండగా అక్కడక్కడా టీడీపీ బరిలో ఉంటే, బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇలాకాలోనూ ఈపరిస్థితి తలెత్తడం గమనార్హం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి
కేపీహెచ్‌బీలో దారుణం
118తో నూరు కష్టాలు
టెస్కాబ్‌ పనితీరు ప్రశంసనీయం
ఫైనలియర్‌ విద్యార్థులకే తరగతులు
కాసింపూర్‌లో కుల బహిష్కరణ
గీత సొసైటీలకు ఇచ్చిన భూములకు పట్టాలివ్వాలి: కేజీకేఎస్‌
వ్యూహాలు.. బుజ్జగింపులు...
రాష్ట్రంలో మహిళా, ట్రాన్స్‌ జెండర్‌ జేఏసీ
బీసీడబ్ల్యూయూ డైరీ ఆవిష్కరణ
యూజర్‌ చార్జీల వసూళ్లపై చర్యలు తీసుకోండి
స్వయం ఉపాధి రుణాల యూనిట్లను పెంచాలి
బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయ అభ్యర్థులు రోడ్లపైనా?
విజయడెయిరీ రైతులకు ప్రోత్సాహక బకాయిలివ్వండి
విద్యుత్‌ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం: మంత్రి కేటీఆర్‌
ఎన్టీఆర్‌ కు చంద్రబాబునాయుడు నివాళి
పీఆర్‌ ఇంజినీరింగ్‌లో ప్రమోషన్ల గొడవ
పథకాల చేరవేతలో అంగన్‌వాడీల పాత్ర కీలకం :మంత్రి సత్యవతి
ఎస్సీ, ఎస్టీలు ఔత్సాహికవేత్తలుగా మారాలి
'జీహెచ్‌ఎమ్‌సీ చట్ట సవరణలపై పిల్‌ ఇప్పుడా...?'
రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలి
దోషులకు శిక్షలు పడాలి
స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు కన్నుమూత
అప్పుల ఊబిలో డిస్కంలు
రైతులతో పెట్టుకున్నోడు ఎవ్వడూ బాగుపడలేదు... : ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి
సీపీఎస్‌ను రద్దు చేయండి

తాజా వార్తలు

10:57 AM

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: యువకుడి మృతి

10:56 AM

వ్యాక్సిన్ పంపిణీ విషయంలో WHO చీఫ్ ఆగ్రహం..

10:52 AM

కరోనా​తో కేరళ ఎమ్మెల్యే మృతి

10:52 AM

మొబైల్ షాప్ లో అగ్నిప్రమాదం

10:39 AM

దేశంలో కొత్తగా మరో 10వేల పాజిటివ్ కేసులు

10:25 AM

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు

10:17 AM

కరోనా టీకా తీసుకున్న ఇద్దరు ఏఎన్ఎంలకు అస్వస్థత

10:11 AM

నగరంలో 50 కేజీల గంజాయి స్వాధీనం

10:01 AM

ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

09:56 AM

నేడు జరగాల్సిన రైతు చర్చలు వాయిదా!

09:53 AM

సూరత్‌ ప్రమాదంపై ప్రధాని, రాజస్థాన్‌ సీఎం సంతాపం

09:17 AM

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

09:10 AM

కేంద్రం కీలక ప్రకటన..వ్యాక్సిన్ తీసుకున్న వారిలో..!

09:00 AM

ఆటా నూతన అధ్యక్షుడిగా భువనేశ్‌ బుజాల

08:45 AM

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

08:25 AM

కొత్త కారు కొనాలనుకునే వారికి భారీ షాక్..!

08:11 AM

ఓల్డ్ అల్వాల్‌లో విద్యార్థిని అదృశ్యం

08:09 AM

రాజన్న సిరిసిల్లలో చిరుత కలకలం

08:07 AM

కన్న కూతురిపై ఏడేళ్లుగా లైంగికదాడి

08:56 AM

కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 15 మంది మృతి

07:37 AM

గుడివాడ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య

07:32 AM

నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం కేసీఆర్

07:04 AM

టీవీ నటిపై పైలట్ లైంగికదాడి

06:46 AM

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

06:41 AM

భీమ‌డోలులో వింత‌వ్యా‌ధి క‌ల‌క‌లం...

08:58 PM

ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు

08:43 PM

ప్రైవేటు బస్సు బోల్తా..

08:20 PM

సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసల జల్లు..

08:13 PM

23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

08:05 PM

ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు రేపు భారత జట్టు ఎంపిక

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.