Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడవి ఆముదం గింజలు తినడంతో..
నవతెలంగాణ- ఆదిలాబాద్‌రూరల్
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి(కె) పాఠశాలలో గురువారం మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో ఉన్న అడవి ఆముదం గింజలు తిన్న విద్యార్థులు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. తరగతి గదుల్లో వాంతులు చేసుకోవడంతో వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని చెప్పారు. పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 7 తరగతి చదువుతున్న విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న అడవి ఆముదం కాయలను పగలగొట్టి గింజలను తిన్నారు. తరగతి గదుల్లోకి వెళ్లిన కొద్దిసేపటికే వాంతులు చేసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఆరా తీయగా, అడవి ఆముదం గింజలు తిన్నట్టు చెప్పారు. వెంటనే రెండు ఆటోల్లో వారిని రిమ్స్‌కు తరలించారు. విద్యార్థుల అస్వస్థత విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి డీఈఓ రవీందర్‌రెడ్డి, రిమ్స్ డైరెక్టర్ బలరాం, ఎంఈఓ కౌసల్య, ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్ కరీం రిమ్స్‌కు చేరుకుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.