Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-షూట్‌ఎట్ సైట్ ఆర్డర్‌కు అవకాశమివ్వొద్దు
-ఇష్టమొచ్చినట్టు రోడ్లమీదికి రావొద్దు
- అత్యవసరమైతే 100కి డయల్ చేయండి
- నిత్యావసరాలు అధికరేట్లకు అమ్మితే పీడీ యాక్ట్
- ప్రజాప్రతినిధులూ మీకు పట్టదా?
- రేపట్నుంచి బియ్యం.. ఖాతాలోకి రూ.1500 : ముఖ్యమంత్రి కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కరోనా నివారణలో మనం ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాం. ప్రజలెవ్వరూ ఇష్టమొచ్చినట్టు రోడ్లమీదకి రావొద్దు. అమెరికాలోలాగా ఆర్మీని దించే పరిస్థితి మన రాష్ట్రంలో తేవొద్దు. ప్రజలు సహకరించకుంటే కర్ఫ్యూ విధిస్తాం. షూట్ ఎట్ సైట్ ఆర్డర్‌కు అవకాశం ఇవ్వొద్దు. అత్యవసరమైతే 100కి డయల్ చేయండి. చావులు, వైద్యసేవలకు ప్రభుత్వమే వాహనాలను సిద్ధం చేస్తుంది' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. వాహనాలను తిప్పడం ఆపకపోతే పెట్రోల్ బంక్‌లు బంద్ చేస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులందరూ పోలీసులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ లాక్‌డౌన్‌లో ఎక్కడికక్కడ చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంగళవారం అత్యవసర, అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఇప్పటివరకూ 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయనీ, వీరిలో ఒకరి చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మిగతావారందరూ కోలుకుంటున్నారనీ, ఎవ్వరికీ ప్రాణహాని లేదని చెప్పారు. ఏప్రిల్ ఏడో తేదీ నాటికి మిగతా వారందరూ డిశ్చార్జి అయ్యే అవకాశంఉందన్నారు. కరోనా సోకని దేశమంటూ లేదనీ, ఇప్పటికే దాదాపు 195 దేశాలకు వ్యాప్తి చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చిన 19,313 మందిపై నిఘా ఉంచామన్నారు. వారందరి పాస్‌పోర్టులను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నిర్మల్‌కు చెందిన ఒక వ్యక్తి మూడు సార్లు తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారనీ, అందువల్ల అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటివరకూ 114 మందిని కరోనా అనుమానితులుగా గుర్తించామన్నారు. వీరిలో 87 మంది విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారనీ, వీరు కాక 37 మంది స్థానిక వ్యక్తులకు సోకినట్టు గుర్తించామని వివరించారు. వారందరి నమూనాలను పరీక్షల నిమిత్తం పంపామని త్వరలోనే నిర్ధారణ రిపోర్టులు వస్తాయన్నారు. ఈ వ్యాధి ఒక దేశానికో? రాష్ట్రానికో పరిమితం కాబోదనే విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. ఒక ప్రత్యేక సందర్భంలో మనం ఉన్నామనీ, అప్రమత్తతే దీనికి నివారణ అని నొక్కి చెప్పారు. ''అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. మనమందరం అప్రమత్తంగా ఉందాం. ప్రభుత్వం వైద్యాధికారులు ఇచ్చే సూచనలు పాటిద్దాం. అమెరికాలో స్థానిక పోలీసులు పౌరులను కట్టడి చేయలేకపోతే ఆర్మీ రంగంలోకి దిగింది. మన దగ్గర కూడా అదే పరిస్థితి తలెత్తితే 24 గంటల కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది. ఈ రోజు నుంచే రాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దయచేసి షఉట్ అండ్ ఆర్డర్ పరిస్థితిని రానివ్వొద్దు. రష్యాలో అధ్యక్షులు 'ఉంటే ఇండ్లల్లో ఉండండి..లేదంటే ఐదేండ్ల పాటు జైళ్లలో ఉండండి' అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ పరిస్థితే ఇక్కడ తలెత్తే విధంగా చేద్దామా? దయచేసి అందరూ సిన్సీయర్‌గా గవర్నమెంట్ రూల్స్ పాటించండి' అని సీఎం విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి బియ్యాన్ని అందజేస్తామనీ, అకౌంట్లలో రూ.1500 జమచేస్తామని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో కూరగాయల, నిత్యావసర ధరలను విపరీ తంగా పెంచడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. అలాంటి చర్యలకు పాల్ప డితే దుకాణాదారులపై పీడీ యాక్టు నమోదు చేస్తామనీ, దుకాణాలను సీజ్ చేస్తామనీ, లైసెన్స్‌లు రద్దుచేస్తామనీ, జీవితంలో షాపులు పెట్టుకోకుండా బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులందరూ యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగాలనీ, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని ఆదేశించారు. సర్పంచ్‌లు గ్రామాలకు కథానాయకులుగా మారాలన్నారు. వైద్యులు, పోలీసులు, మున్సిపల్, రవాణా శాఖ అధికారులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అయితే ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఏవిధంగా ఉంటుందో అర్థంకాని పరిస్థితి నెలకొం దన్నారు. కరోనా అనుమానితులు, విదేశాల నుంచి వచ్చిన వాళ్లు సహకరిం చాలని కోరారు. గ్రామాల్లో, పట్టణాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోనే పరిస్థితి ...పోలీసులు అదుపులో లేదనీ, అసలు 150 మంది కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వెంటనే వారు పోలీసులు, అధికారులతో కలిసి చెక్‌పోస్టుల వద్ద నిఘా బృందాలతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిష నరేట్ల పరిధిలోని ప్రజాప్రతినిధులందరూ పోలీసులు, వైద్యాధికారులు, మీడి యాకు సహకరించాలని కోరారు. ఇదే సమయంలో ప్రభుత్వమే మీడియాకు అనుమతి ఇచ్చిందనీ, ఈ విషయాన్నిడీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు అంద రూ గుర్తించి మీడియాకు సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.