Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను ఆదుకోవాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈసీ) నేత సంపత్‌కుమారస్వామి డిమాండ్ చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై శుక్రవారం హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న పేదలను నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని కోరారు. కార్మికులకు వేతనాలు చెల్లించేలా యాజమాన్యాలకు ఆదేశాలివ్వాలని చెప్పారు. అసంఘటిత కార్మికులకు నగదు బదిలీ చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏపై విధించిన ఫ్రీజింగ్‌ను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆనుకూల విధానాలను ఉపసంహరించాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనీ, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలనీ సూచించారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు.