Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జపాన్ కంపెనీ సోనీ ఇండియా మార్కెట్‌లోకి భారీ బడ్జెట్ గల స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2 పేరుతో ఇది అందుబాటులో ఉంది. హై అండ్ స్పెసిఫికేషన్స్‌తో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వైర్‌లెస్ ఛార్జింగ్, గూగుల్ కాస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ సర్టిఫైడ్, డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఇది. సోనీ నుంచి వచ్చిన గత ఫోన్లలాగే ఫ్లేరి లుక్, యూనిక్ ప్యాటెర్న్ కలిగి ఉంది. కానీ దీని మెటల్‌లో ఎక్కువ 3డీ గ్లాస్‌ను ఉపయోగించినట్టు సోని పేర్కొంది. ధర రూ. 72,990 గా నిర్ణయించింది.
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2 స్పెషిఫికేషన్లు..
డిస్‌ప్లే : 5.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్
స్క్రీన్ ప్రొటెక్షన్ : కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5
ప్రాసెసర్ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845
ఓఎస్ : ఆండ్రాయిడ్ ఓరియో
ర్యామ్ : 6 జీబీ ర్యామ్, స్టోరేజీ : 64 జీబీ
కెమెరా : 19 మెగాపిక్సెల్ రియర్ 5 ఎంపీ సెల్ఫీ
బ్యాటరీ : 3180 ఎంఏహెచ్