Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుకోకుండా విహార యాత్రను ప్లాన్ చేసుకున్నారు. అక్కడ చూడవల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఏ మాత్రం ముందస్తు అవగాహన లేకుండా ఆ ప్రదేశాలను తిలకించటం కాస్తంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే మీరు సందర్శించాలనుకుంటున్న ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలను ఒకే పేజీలో ప్రింట్ తీసుకోవటం ద్వారా విహారయాత్రను ఏ మాత్రం మిస్ కాకుండా పూర్తి స్థాయిలో ఆస్వాదించగలరు. అదెలాగే తెలుసుకుందాం.
విండోస్ పీసీ లేదా ల్యాప్‌టాప్ ద్వారా మీ వద్ద ఉన్న ఫొటోలను ఏ విధమైన థర్డ్ పార్టీ ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించకుండా డిజిటల్ క్యామ్ లేదా ఇంటర్నెట్ ద్వారా మీరు సేకరించిన ఫొటోలను ఒకే పేజీలో ప్రింట్ తీసుకోవచ్చు.
ముందుగా ఫోల్డర్‌లో మీకు కావల్సిన ఫొటోలను సెలక్ట్ చేసుకోండి. ఆ తరువాత సెలక్ట్ చేసుకున్న ఫొటోల పై రైట్ క్లిక్ చేసినట్లయితే అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రింట్ మెనూ ఓపెన్ అవుతుంది. ప్రింటర్, పేపేర్ సైజ్, క్వాలిటీ అనే ఆప్షన్‌లు కనిపిస్తాయి. ప్రింటర్ కాలమ్‌లో మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.
అలానే పేపర్ సైజ్ మెనూలో మీకు నచ్చిన పేపర్ సైజ్‌ను సెట్ చేసుకోవచ్చు.ప్రింట్ మెనూ కుడి వైపు భాగంలో స్లైడర్ మాదిరి లేవట్ బార్ మీకు కనిపిస్తుంది. ఈ లేవుట్ స్లైడర్‌లో వివిధ సైజులతో కూడిన ప్రివ్యూలను మీరు చూడొచ్చు.. ఒక పేజీలో ఒక ఫొటోనే కావాలా లేక రెండు ఫొటోలు కావాలా లేకుంటే 4 లేదా 9 ఫొటోలు కావాలా ఇలా రకరకాల ప్రివ్యూ ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన ప్రివ్యూను సెట్ చేసుకుని ప్రింట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఒకే పేజీలో మీరు ఎంపిక చేసుకున్న ఫొటోలను ప్రింట్ రూపంలో పొందవచ్చు.