Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిజిటలైజేషన్ పెరుగు తున్న నేపథ్యంలో ప్రతిదీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అవుతోంది. ఏ పేమెంట్ చేయడానికైనా ఆన్‌లైన్ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్‌కు సంబంధించిన లావాదేవీలలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి లావాదేవీలతో కొంత ఇబ్బందేనంటున్నారు సాంకేతిక నిపుణులు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి లావాదేవీల విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే డబ్బును కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. అవి..
- అవసరానికి తగినట్టు అనేక రకాల బ్యాంకు అకౌంట్‌లు ఉపయోగిస్తుంటాం. వాటికి తగినట్టే యూపీఐ అకౌంట్లు కూడా సెట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా యూపీఐ సెట్టింగ్స్ చేసుకునేటప్పుడు ఎవరి సాయం తీసుకోకుండా సొంతంగా యూపీఐ పిన్ సెట్ చేసుకోవడం మంచిది. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేం కాబట్టి మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, పిన్ ఆధారంగా వారు మీ ఖాతాలో సొమ్ము తస్కరించే అవకాశం ఉంటుంది.
- ఆన్‌లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్‌లు చేసేపుడు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్(ఓటీపీ), పిన్‌లను ఎవ్వరికీ పంపకూడదు. ఈ మధ్య వీటి ద్వారా కూడా నగదు చోరీ అవుతోంది. ఎవరినీ ఓటీపీ చెప్పమని అడగకూ డదు. బ్యాంకులు కూడా ఈ పరమైన హెచ్చరికలు చేస్తున్నాయి.
- కొన్నిసార్లు బ్యాంక్ ప్రతినిధులమంటూ కొన్ని కాల్స్ వస్తాయి. నమ్మకం కలిగేలా కార్డుకు లేదా అకౌంట్‌కు సంబంధించిన కొంత సమాచారం చెబుతారు. తర్వాత మిగిలిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి కాల్స్ కట్ చేసేయాలి. పొర పాటున నమ్మి వివరాలు చెప్తే.. ఇక అంతే సంగతులు.. నగదు ఖాళీ అయిపోతుంది.
- ఆన్‌లైన్ మోసాలు చేసే వారు రోజుకో కొత్త పంథాలో వెళ్తున్నారు. బ్యాంకింగ్ వర్చువల్ పేమెంట్ అడ్రెస్ (వీపీఏ) ఐడీ ద్వారా ఓటీపీ, పిన్ నంబర్లతో సంబంధం లేకుండా ఎంపిన్(MPIN) సెట్ చేసుకుని ఖాతా నుంచి లావాదేవీలు చేయవచ్చు. అందువల్ల ఎవరైనా కాల్ చేస్తే కనీసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చెప్పకపోవడమే మంచిది.
- మొబైల్ ఫోన్‌కు తెలియని నంబర్ల నుంచి ఏదైనా అనుమానాస్పద లింకులు వస్తే.. వాటిని పొరపాటున కూడా ఓపెన్ చేయవద్దు. అటువంటి వాటి ద్వారా మీ ఫోన్ హ్యాక్ చేసి బ్యాంకింగ్ వివరాలతో పాటు, ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారమూ తస్కరించే ప్రమాదం ఉంది.
- యూపీఐ ఖాతాలకు అపుడప్పుడు లావాదేవీలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు వస్తుంటాయి. అవి మనీ రిక్వెస్ట్‌కా, మనీ సెండింగ్‌కు సంబంధిం చినవా అని పరిశీలించుకోవాలి. సెండ్ అని వస్తే మీకు ఖాతాలో నగదు జమ అయినట్లు, రిసీవ్ ద్వారా వస్తే.. మీ ఖాతా నుంచి నగదును అభ్యర్థిస్తున్నట్లు. డబ్బులు పంపిస్తామని చెప్పి, రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా ఖాతాలో నగదు తస్క రించే అవకాశం ఉంది. పొరపాటున రిసీవ్ మీద క్లిక్ చేసి, ఆ లావాదేవీని పూర్తి చేస్తే ఖాతాలో నగదు ఖాళీ పోతుంది. ఆన్‌లైన్ లావాదేవీలు చేసేపుడు ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, ఖాతాలో నగదు వేరే వాళ్ళు ఖాళీ చేయకుండా కాపాడుకోవచ్చు.