పేటీఎం యాప్.. ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవ. మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం వివిధ రకాల సర్వీసులు అందిస్తోంది. ఈ యాప్ ఒక బ్యాంక్‌లా ఉపయోగపడుతోంది. డెబిట్ కార్డును సైతం అందిస్తోంది. అయితే ఈ యాప్‌తో ఎల్‌ఐసీ పాలసీని తక్కువ సమయంలోనే చెల్లించొచ్చు. సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అది కూడా పేటీఎం యాప్ (ఆండ్రాయిడ్, యాపిల్), పేటీఎం వెబ్‌సైట్ నుంచి కట్టేయవచ్చు. ఇందుకోసం చేయాల్సినది.. ఈ యాప్‌ను ఉపయోగిస్తుంటే యాప్‌లోకి వెళ్లాలి. ఓపెన్ చేసిన తర్వాత ఎల్‌ఐసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో పాలసీ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత పాలసీదారు పేరు, ప్రీమియం చెల్లింపు తేదీ, ఇన్‌స్టాల్‌మెంట్ డ్యూ, ప్రీమియం అమౌంట్ వంటి వివరాలను చెక్ చేసుకోవాలి. ఏవైనా ఇన్సూరెన్స్ ఆఫర్స్, ప్రోమో కోడ్స్ ఉంటే చూసుకోవాలి. ప్రొసీడ్ పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. పేమెంట్ మెథడ్ ఎంచుకుని డబ్బులు కట్టేయాలి. మొత్తం ప్రాసెస్ పూర్తయ్యాక రిజిస్ట్రడ్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ పంపిస్తుంది. ఈమెయిల్ కూడా వస్తుంది. అంతేకాదు దీనితో ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఎల్‌ఐసీ ఇన్సూరెన్స్ ప్లాన్, స్పెషనల్ ప్లాన్స్, ఎల్‌ఐసీ పెన్షన్ ప్లాన్స్, యూనిట్ ప్లాన్స్, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్, విత్‌డ్రా ప్లాన్స్, ఎల్‌ఐసీ హెల్త్ ప్లాన్స్ వంటి వివిధ రకాల పాలసీల ప్రీమియం చెల్లించవచ్చు.