ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం ఉన్న డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ కామ్‌స్కానర్ కొత్త ఫీచర్లతో మరింత చేరువైంది. మన దేశంలోనూ దీనిని ఎంతో మంది ఉప యోగిస్తుండడంతో వినియోగదారుల అవసరాల దృష్ట్యా కంపెనీ మరింత సులభతరంగా మార్పులు చేసి అందిస్తోంది. ఇందులో ఐడీ కార్డులు, లైసెన్స్‌లు, సర్టిఫికెట్‌లు ఇలా అనేక రకాల డాక్యు మెంట్‌లు ఇమేజ్ రూపంలో భద్రపరుచుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా, మొబైల్‌లోనే సేవ్ చేసుకోవాలన్నా, మెయిల్‌కు పంపించుకోవాలన్నా.. సులభతరంగా ఉంటుంది. ఇందులో - ఇమేజ్ నుంచి స్ప్రెడ్ షీట్ : ఏదైనా ఒక పేపర్‌ను స్కాన్ చేసి దానిని స్ప్రెడ్‌షీట్‌గా మార్చుకోవచ్చు. - బుక్ టు ఈ-బుక్ : పుస్తకాలు ఎక్కువగా చదివే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే బుక్ అనే ఆప్షన్ ద్వారా పుస్తకంలోని పక్కపక్క పేజీలను ఒకేసారి స్కాన్ చేసుకుంటే, రెండు పేజీలుగా ఆటోమేటిక్‌గా విభజిం చబడతాయి. అంతేకాదు చదివేందుకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. - స్కాన్ ది పవర్ పాయింట్ ప్రజంటేషన్ : విద్యార్థులు ఏదైనా ప్రాజెక్టు పని మీద ఇచ్చే పవర్‌పాయింట్ ప్రజంటేషన్స్‌ను ఇందులో స్కాన్ చేసి ప్రిపేర్ చేసుకుంటే.. మాన్యువల్‌గా ఉన్న వాటి కంటే ఎక్కువ క్లారిటీతో కనిపిస్తాయి. - ప్రింట్ యువర్ సర్టిఫికెట్స్ : సర్టిఫికెట్‌లను స్కాన్ చేసి, అందులోనే ప్రింట్ ఆప్షన్‌ను ఎంచుకుని డైరెక్ట్‌గా ప్రింట్ ఇచ్చుకోవచ్చు. - సెర్చ్ అండ్ ట్రాన్స్‌లేట్ : స్మార్ట్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నై జేషన్ (ఓసీఆర్) అనే ఆప్షన్ స్కాన్ చేసిన డాక్యుమెంట్‌లోని ఎలాంటి టెక్ట్స్‌ను అయినా సెర్చ్ చేస్తుంది. దానిని ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఇందులో 60 కిపైగా భాషలు అందు బాటులో ఉన్నాయి. అంతేకాదు, ఇందులో డాక్యుమెంట్‌లను భద్రంగా కాపడడానికి అనేక భద్రతాపరమైన లేయర్లు ఉన్నాయి. 200 దేశాలలో 370 మిలియన్‌ల డివైజ్‌లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారని, రోజుకు 50 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉంటున్నారని సంస్థ వెల్లడించింది. అయితే అప్‌డేట్ అయిన ఫీచర్లు వీఐపీ అకౌంట్ కలిగిన వినియోగదారులకు వెంటనే అందుబాటులోకి వస్తాయని, దాదాపు 10 జీబీ వరకు స్పేస్ ఉండేలా మార్పులు చేసినట్టు సంస్థ వెల్లడించింది.