వాట్సాప్‌లో గ్రూపులు బాగా పెరిగి పోతున్నాయి. ఏదో ఒక కేటగిరీకి అవసరాల రీత్యా గ్రూపు క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఎప్పటి కప్పుడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చే వాట్సాప్.. ఈ సారి గ్రూపుకు సంబంధించి మరో సెట్టింగ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే.. ఎవరైనా సరే అనుమతి లేకుండా గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేసే వీలు లేకుండా చేసుకునే సెట్టింగ్స్.. గ్రూపు చాటింగ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఫోన్‌లో ఎక్కువ వేస్ట్ మెసేజ్‌లు వచ్చి చేరిపోతున్నాయి. వాటి వల్ల ఇబ్బందులు తలెత్తడం సహజం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సహోద్యోగులు, క్లాస్‌మేట్స్.. ఇలాంటి గ్రూపుల వల్ల మనకు ఇబ్బందిగా అనిపించదు. అయితే ఈ మధ్య ఎక్కువగా బిజినెస్‌కు సంబంధించి గ్రూపులు పెరిగిపోతున్నాయి. ఒకే కేటగిరికి సంబంధించి అనేక గ్రూపులు ఉంటు న్నాయి. వాటి వల్ల రోజుకు వందల సంఖ్య లో ఫొటోలు మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. వీటి వల్ల ఫోన్ నిండి పోయే అవకాశం ఉంది. అంతేకాదు అనవసరమైన, మనకు తెలియని వారు కూడా మనల్ని గ్రూపులలో యాడ్ చేస్తుంటారు. ఇది ఇబ్బంది కలిగించేదే. ఇటువంటి వాటి మీద దృష్టిపెట్టిన వాట్సాప్ బృందం గ్రూప్స్ కోసం కొత్త ప్రైవసీ సెట్టింగ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ఫోన్‌లో ఎనేబుల్ చేసుకుంటే సరి.. సమస్యను దూరం పెట్టినట్టే. ఇందుకు చేయాల్సింది.. ముందుగా వాట్సాప్‌ని అప్‌డేట్ చేయాలి. తరువాత, యాప్‌లోని సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయాలి. అందులో అకౌంట్‌లో ప్రైవసీని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో గ్రూప్స్ అనే ఆప్షన్‌లో ఎవిరీవన్ అని ఉంటుంది. ఇలా ఉంటే ఎవరైనా సరే గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేసేయవచ్చు. అందులో మై కాంటాక్ట్స్‌ని ఎంచుకుంటే కేవలం కాంటాక్ట్‌లో ఉన్న వారు మాత్రమే మిమ్మల్ని గ్రూపులో యాడ్ చేసే వీలుంటుంది. ఎక్సెప్ట్ మై కాంటాక్ట్స్‌ని ఎంచుకుంటే కాంటాక్ట్‌లోని లేనివారికి ఎవరికి మీరు అవకాశం ఇవ్వాలనుకుంటే వారికి ఇవ్వొచ్చు. మీరు అనుమతి ఇచ్చిన వారు మాత్రమే మిమ్మల్ని గ్రూపులో యాడ్ చేసే వీలుంటుంది. ఇందులో కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవాల. ఎలా కావాలో నిర్ణయించుకుని సెట్టింగ్స్ చేసుకుంటే సరి..