ఆధార్.. ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయిన గుర్తింపు కార్డు. చాలా కీలకమైన డాక్యుమెంట్ కూడానూ. అయితే అన్ని చోట్ల ఆధార్‌తో స్థానంలో ఉపయోగించే మాస్క్‌డ్ ఆధార్ గురించి తెలుసా..? మాస్క్‌డ్ ఆధారా..? అదేంటి..? అదెలా ఉంటుంది..? ఎలా తీసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఇది మీ కోసమే.. సిమ్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్, ట్రైన్ టికెట్ బుకింగ్, ఎయిర్ పోర్ట్.. ఇలా ప్రతి చోట ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ప్రతి చోట ఆధార్ ఇవ్వడం వల్ల మన సమాచారానికి భద్రత లేదు అనే విషయంపై చాలా వార్తలు వచ్చాయి. వాటి నిజానిజాలు పక్కకు పెడితే.. ఆధార్ వాడడం తప్పడం లేదు. ఆధార్ కార్డును సురక్షితంగా మార్చేందుకు యూఐడీఏఐనే మాస్క్‌డ్ ఆధార్ కార్డులను అందిస్తోంది. ఆధార్ నెంబర్‌ను ఎవరికైనా చెప్పడానికి ఇష్టపడకపోతే అప్పుడు మాస్క్‌డ్ ఆధార్ నెంబర్ ఇవ్వొచ్చు. మాస్క్‌డ్ ఆధార్ కార్డును డిజిటల్లీ సైన్‌డ్ ఇ-ఆధార్‌గా పరిగణించవచ్చు. దీంతో మీ ఆధార్ డేటాకు పూర్తి భద్రత లభిస్తుంది. ఆధార్ కార్డులో 12 అంకెలు ఉంటాయి. అయితే మాస్క్‌డ్ ఆధార్ కార్డులో కేవలం 4 అంకెలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. మిగతా 8 అకెంలు ఇంటూ మార్క్ ద్వారా కవర్ చేసి ఉంటాయి. అయితే కేవలం ఆధార్ నెంబర్‌పై మాత్రమే మాస్క్ ఉంటుంది. బయోమెట్రిక్, ఫోటోగ్రాఫ్, క్యూఆర్ కోడ్ వంటివి అలానే ఉంటాయి. ఎయిర్ పోర్ట్స్, ట్రైన్ టికెట్ బుకింగ్ వంటి వాటికి ఐడెంటిఫికేషన్ కోసం మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించొచ్చు. తీసుకోవడం ఎలా..? యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ కు వెళ్లి, హోమ్ పేజీలో ఆధార్ లింక్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్ నెంబర్, పేరు, పిన్‌కోడ్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మాస్క్‌డ్ ఆధార్ అనే ఆప్షన్‌ను ఎంచు కోవాలి. వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెరిఫికేషన్ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయగానే వెరిఫికే షన్ పూర్తయి ఇ-ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాస్క్‌డ్ ఆధార్ కార్డులు ఉపయోగించడం కుదరదు. ఎల్‌పీజీ సబ్సిడీ, పెన్షన్ తదితరాలకు ఈ ఆధార్ కార్డు ఇవ్వకూడదు.