ఆండ్రాయిడ్.. ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే ఫోన్‌లు ఇవే.. గూగుల్ ఆండ్రాయిడ్‌లో బీటా వర్షెన్‌ను గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా 10 వర్షెన్‌ను తీసుకువచ్చింది. అయితే గతేడాది తీసుకువచ్చిన ఆండ్రాయిడ్ పి బీటా వర్షెన్ పూర్తిస్థాయిలో అందుబాటు లోకి రాలేదు. అయితే వర్షెన్ 8 తర్వాత వచ్చిన ఈ ఆండ్రాయిడ్ పి(పై) వర్షెన్‌కు అనుబంధంగా సోషల్ మీడియా యాప్స్‌లలో మార్పులు ఎక్కువగా ఉంటున్నాయి. వీటితో పాటు అసలు ఈ వర్షెన్‌తో ఉన్న ఉపయోగాలేంటో తెలుసుకుందాం..
గూగుల్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వచ్చిన వర్షెన్‌లలో తొమ్మిదవ తరమైన ఆండ్రాయిడ్ పి(పై) ప్రస్తుతం అధికంగా వినియోగంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఓఎస్‌లో ఇప్పటికే 'డోజ్‌మోడ్' అనే ప్రత్యేకమైన సదు పాయం ఉంది. దీని ద్వారా అప్లికేషన్‌లు వీలై నంత తక్కువ మొత్తంలో బ్యాటరీని వినియోగిం చుకునేలా ఏర్పాటు చేశారు. అయితే సిస్టమ్ వనరులనూ బ్యాటరీని అప్లికేషన్‌లు వినియోగించు కునే విధానాన్ని మరింత మెరుగు పరుస్తూ ఆండ్రా యిడ్ ఆపరేటింగ్ -పి ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఆడాప్టివ్ బ్యాటరీ అనే ఆప్షన్‌ను సెట్టింగ్స్‌లో పొందుపరిచారు. ఇది ఏయే అప్లికేషన్‌లు మనం అసలు ఉపయోగించడం లేదో గ్రహిస్తుంది. ఉపయోగించే అప్లికేషన్‌లకు సిస్టమ్ వనరులు తక్కువ కేటాయించుకునేలా చేస్తుంది. వీటితో పాటు మరికొన్ని ఫీచర్లను ఈ అప్లికేషన్ తీసుకువచ్చింది.
అడాప్టివ్ బ్రైట్‌నెస్ : ఫోన్ ఎటువంటి పరిస్థితులలోనైనా సరిగా కనిపించాలని చాలా వరకు ఆటోబ్రైట్‌నెస్ ఆన్ చేయడం చాలా మందికి అలవాటు. ఇలా చేయడం వల్ల వాతావరణంలో వెలుగును బట్టి ఫోన్‌లో కాంతి హెచ్చు తగ్గులు చూపిస్తూ ఉంటుంది. అయితే గూగుల్ తీసుకువచ్చిన యాంబియెంట్ సెన్సార్ అనే ఆప్షన్ ద్వారా ఆ అవసరం లేకుండా చేస్తుంది. దీని వల్ల ఏయే సమ యాలలో ఎటువంటి సెట్టింగ్‌లు కాన్ఫిగర్ చేస్తున్నారో మెషీన్ లెర్నింగ్ ద్వారా అర్థం చేసుకుంటుంది. అంటే ప్రస్తుత ప్రదేశానికి, అవసరానికి తగినట్టు ఆటేమే టిక్‌గా బ్రైట్‌నెస్ మార్చుకుంటూ ఉంటుంది. ఉదా హరణకు చీకటి ప్రదేశంలో ఫోన్ ఉపయోగిస్తే అందుకు తగినట్టు లైటింగ్‌ను సెట్ చేస్తుంది. అయితే మొదట్లో సందర్భాన్ని బట్టి మనం సెట్ చేసుకునే బ్రైట్‌నెస్ పైనే తర్వాత్తర్వాత అలాంటి సందర్భంలో ఎంత బ్రైట్‌నెస్ అవసరమో ఆటో మేటిక్‌గా సెట్ చేసుకుంటుంది.
యాప్ యాక్షన్స్ : ఫోన్‌లో చాలా రకాల అప్లికేషన్‌లు ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటాం. అందులో రోజు ఉపయోగిం చేది కొన్ని మాత్రమే. ఇలా తరచూ ఉపయోగించే అప్లికేషన్‌లు మనకు సులువుగా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఈ వర్షెన్‌లో ఉంది. అదే యాప్ సజెషన్స్.. దీని ద్వారా యాప్ డ్రాయిర్‌లోని అప్లికేషన్‌లు ఎన్నింటిని తరుచూ వాడాము.. ఆ సమయం సందర్భాన్ని బట్టి ఏయే అప్లికేషన్‌లు ఉపయో గించామో, వాటి తర్వాత ఏ అప్లికేషన్‌లు ఉపయోగించేందుకు ఆస్కారం ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గ్రహించి, యాప్ డ్రాయిర్ పై భాగంలో చూపిస్తుంది. ఉదాహరణకు మ్యూజిక్ వినే అలవాటు రోజు ఉంది. కొన్నిసార్లు దానిని ఉపయోగించడం ప్రారంభమయ్యాక, మళ్ళీ ఆ అప్లికేషన్‌ను వద్దకు వెళ్ళి ఓపెన్ చేయాల్సిన పని లేకుండా షార్ట్‌కట్‌లా చూపిస్తుంది. రెగ్యులర్‌గా కాల్ చేసే వారి పేర్ల లిస్ట్‌నూ చూపిస్తుంది.
స్లైసెస్ : పెద్ద యూజర్ అప్లికేషన్‌లకు సంబంధించిన అనేక రకాల పనులు గూగుల్ సెర్చ్‌లో పూర్తి చేసుకోవాలంటే మాత్రం ఆండ్రాయిడ్ పి స్లైసెస్ అనే ఆప్షన్ ఉపయోగ పడుతుంది. అంటే ఉపయోగించే యాప్‌కు సంబంధించి దేనిని ఎక్కువ సార్లు ఉపయోగిస్తామో అది ఒక బ్లాక్‌లా ఏర్పడిపోయి ఉంటుంది. మనం ఆ యాప్‌ను ఓపెన్ చేయగానే వెంటనే ఆ యాక్షన్ మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు గూగుల్‌లో ఒక విషయం గురించి సెర్చ్ చేశాం. తర్వాత మళ్ళీ గూగుల్‌లో అదే విషయాన్ని వెతకాల్సిన అవసరం లేకుండా సేవ్ అయి స్లైడ్‌లా ఏర్పడి ఉంటుంది.
గెశ్చర్ నేవిగేషన్ : ఆండ్రాయిడ్ ఫోన్‌లలో రీసెంట్ అప్లికేషన్‌లు చూడాలన్నా, ఒక అప్లికేషన్ నుంచి మరో అప్లికేషన్‌కు మారాలన్నా.. స్క్రీన్ కింది భాగంలో ఉండే నావిగేషన్ బటన్‌ను వాడాల్సి ఉంటుంది. ఇందులో మాత్రం.. ఐఫోన్ ఎక్స్‌లో ఉండే విధంగా గెశ్చర్ నేవిగేషన్ విధానాన్ని తీసుకువచ్చారు. స్క్రీన్ మీద నుంచి కింది వైపుకు స్వైప్ చేస్తే సిస్టమ్ ఓవర్ వ్యూను, కుడి ఎడమలకు స్వైప్ చేస్తే ఒక అప్లికేషన్ నుంచి మరో అప్లికేషన్‌కు సులభంగా మారి పోవచ్చు. స్మార్ట్‌టెక్ట్స్ సెలెక్షన్ ద్వారా పూర్తి స్థాయిలో వేరే అప్లికేషన్‌కు మారాల్సిన అవసరం లేకుండానే అందులో అవసరమైన టెక్ట్స్‌ను కాపీ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంకా ఫీచర్స్ డెవలప్‌మెంట్‌కు అనుగుణంగా ఎంఎల్ కిట్, డిజిటల్ వెల్‌బీయింగ్ వంటి ఫీచర్లను తీసుకువచ్చింది.
Authorization