రోజురోజుకు దేశంలో మహిళలపై ఆగాయిత్యాలు పెరిగిపోతున్నాయి.. ప్రమాదం ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తుందో చెప్పడం కష్టతరం.. ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉంటున్నాయి. ఆపదలో ఉన్నామని లైవ్ లొకేషన్ యాప్ ఉపయోగించి అయిన వారికైనా సమాచారం అందించొచ్చు. సాధార ణంగా వాట్సాప్‌లో లైవ్ లొకేషన్ ఫీచర్ అంద రికీ తెలుసు. అయితే గూగుల్ మ్యాప్స్‌లోనూ అటువంటి ఫీచర్ అందుబాటులో ఉంది. దీని ద్వారా లైవ్ లొకేషన్ మాత్రమే కాదు.. ఫోన్‌లో ఎంత చార్జింగ్ ఉంది అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించు కోవాలంటే ఈ విధానాన్ని పాటించాలి.
ఙ ముందుగా ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, ఎడమవైపు పైభాగంలో ఉండే హాంబర్గర్ (మూడు గీతల ఐకాన్) ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అందులో కనిపించే ఆప్షన్‌లలో లొకేషన్ షేరింగ్‌పై క్లిక్ చేయాలి.
ఙ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో 'గెట్ స్టార్టెడ్' అనే ఆప్షన్ ఉంటుంది.. దానిపై క్లిక్ చేయాలి. మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
ఙ అందులో గెట్ స్టార్టెడ్‌పై క్లిక్ చేస్తే.. పైన 'షేర్ యువర్ లైవ్ లొకేషన్' ఆప్షన్ కనిపిస్తుంది. కిందనే టైమ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ 15 నిమిషాల నుంచి మూడు రోజుల వరకు లొకే షన్ షేర్ చేసే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ప్లస్, మైనస్ గుర్తులుంటాయి. అక్కడ టైమ్ లిమిట్ సెట్ చేసుకొవచ్చు. దానితో పాటు కిందనే 'అన్ టిల్ యు టర్న్ దిస్ ఆప్' అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే లోకేషన్ షేరింగ్ ఆపే వరకు కొనసాగుతూనే ఉంటుంది. వెంటనే కింద గూగుల్ కాంటాక్ట్స్‌తో పాటు వాట్సాప్, మెసెం జర్, హ్యాంగ్ అవుట్స్, టెలిగ్రాం, ఎస్‌ఎంఎస్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వివిధ సామాజిక మాధ్యమాలు కనిపిస్తాయి. మెసేజ్‌ని పంపినట్టే లొకేషన్‌నూ పంపొచ్చు.
ఙ ఈ ఆప్షన్‌లలోనే లొకేషన్‌తో పాటు ఫోన్‌లో ఎంత చార్జింగ్ ఉందో కూడా అర్థమైపోతుంది. వాట్సాప్ ద్వారా కూడా 15 నిమిషాల నుంచి 8 గంటల వరకు లొకేషన్ పంపొచ్చు. అందువల్ల ఎవరైనా, ఎప్పుడైనా అనుకోని ప్రమాదం ఎదుర వుతున్నదని తెలిసినపుడు, అనుమానం రాగానే వెంటనే తెలిసిన వారికి లొకేషన్ షేర్ చేయండి. దీన్ని బట్టి మీరు ఆపదలో ఉన్నారని అవతలి వారికి అర్థమైపోతుంది. రక్షించడానికి, మీ దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది.
Authorization