Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వచ్చినట్టే వచ్చి ముఖం చాటేయడంతో వర్షాలు లేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జూన్‌లో కురిసిన రెండు మూడు భారీ వర్షాలకు అనేక ప్రాంతాలలో రైతులు అప్పులు చేసి పంటలు వేశారు. కానీ ఆ తర్వాత చుక్కనీటి జాడలేదు. దీంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పంటసాగు కోసం చేసిన అప్పులు ఎలా తీరుతుందో అనే ఆందోళనతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఐతే వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఎల్‌నినో కారణంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో మబ్బులకు చల్లటి గాలులు లేక అవి వర్షించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కృత్రిమంగా మేఘమథనం ద్వారా మేఘాలను చల్లబరిచి వర్షాలు కురిసేవిధంగా చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కావున ప్రభుత్వ యంత్రాంగం మేఘమథనం ద్వారా వర్షాలు పడేటట్టు చర్యలు తీసుకోవాలి. మేఘమథనం కార్యక్రమాన్ని తీవ్ర వర్షాభావ పరిస్థితులు వున్న ప్రాంతాలలో చేపట్టాలి. అన్నదాతలను ఆదుకోవాలి.
- బి. ప్రేమ్‌లాల్,
వినాయక్‌నగర్, నిజామాబాద్.