Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్య సమితి ఆదేశానుసారం ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆకాశంలో సగభాగం అంటూ ఉదరగొడుతూ కుర్చీలాటలు ఆడించి బహుమతులిచ్చి చేతులు దులుపుకుంటున్నాం. కానీ మహిళల సామాజిక ఆర్థిక స్థితిగతులు, వారిపై సాగుతున్న హింస, దౌర్జన్యాలలో ఏ మార్పూ రాలేదు. భారతదేశ సమాజంలో స్త్రీల పట్ల ఉన్న చిన్న చూపే ఆడ శిశువుల హత్యలకు కారణం అవుతుంది. ఆత్మహత్యలకూ, లైంగిక దోపిడీకి దారి తీస్తుంది. ఆర్థిక స్వావలంభన సాధించుకున్న స్త్రీల జీవితాలను సైతం పితృస్వామ్య వ్యవస్థ మార్పు దిశగా తీసుకెళ్ళలేదు. వేధిపులు, అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు తగ్గడం కాదు కదా నాటినా టికీ పెరుగుతున్నాయి. నిర్బయ చట్టం అమలులోకి వచ్చినా ఆ చట్టం గురించిన భయం ఎక్కడా కనిపించడం లేదు. పురుషుని మానసిక స్థాయిలో ఏమాత్రం మార్పులేదు. దీనికి తాజా ఉదాహరణ 2012 డిసెంబర్ 16న దేశరాజధాని ఢిల్లీలో 23 ఏండ్ల వైద్య విద్యార్థినిపై అతి కిరాతకంగా అత్యాచారం చేసి బస్సులో నుంచి తోసివేసిన ఆరుగురు నిందితులలో ఒకడైన ఉరిశిక్షపడిన ముకేష్‌సింగ్ సంచలన వ్యాఖ్యలే నిదర్శనం. తనకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ అప్పీలు చేసుకున్న సందర్భంగా అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంకా ఏ మాత్రం కొవ్వు కరగని ప్రేలాపనలు చేశాడు. చూస్తుంటే సమాజం ఏటుపోతుంది అని ఆందోళన కలుగుతోంది. మహిళలు తమ ఆకాంక్షలు తెలియజేయ డానికి, హక్కుల కోసం డిమాండ్ చేయడానికి గొంతెత్త వలసిన అవసరం ఉంది. ఈ దేశంలో పేదవాళ్లలో నూటికి 70శాతం, ప్రపంచవ్యాప్తంగా నూటికి 67గంటలు పనిచేసేది స్త్రీలే. కానీ వీరి అక్షరాస్యత 54శాతంగానే ఉంది. 14ఏండ్లలోపు బాలికలకు ఇప్పటికీ నిర్భంద విద్య అమలు కావటం లేదు. యుక్త వయస్సులో ఉండవల్సిన ఆరోగ్య సంరక్షణ లేదు. ఆడ పిల్లలకి గర్భంలోనే చావు భయం వెంటాడుతుంది. భ్రూణ హత్యల వల్ల స్త్రీ పురుషుల మధ్య సెక్స్‌రేషియో ప్రభావితమవుతోంది. ప్రతీ 1000 మంది పురుషులకు 920మంది మహిళలు మాత్రమే మిగులుతున్నారు. భారతదేశంలో ప్రతీ 30 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగు తోంది. ప్రతీ 10 నిమిషాలకు ఒక మహిళ లైంగిక వేధింపులకు గురవుతోది. ప్రతీ 40 నిమిషాలకు ఒక స్త్రీ లేదా మైనర్ బాలిక అదృశ్యమవుతున్నది. ప్రతీ 55 నిమిషాలకు ఒక స్త్రీ వరకట్న చావులకు బలవుతున్నది. ప్రతీ 18 నిమిషాలకు స్త్రీ కుటుంబ హింసకు గురవుతున్నది. 72ఏండ్లలో దాదాపు దేశంలో కోటి 95 లక్షల మందికిపైగా ఆడ పిల్లలు, భ్రూణహత్యలకు గురయ్యారని అంచనా. ఆరోగ్యంలో నిర్లక్ష్యం, బాల్య వివాహాలు, లైంగిక అత్యాచారాలు, యాసిడ్ దాడులు, కట్నం పిశాచులు, వేధింపులు, విడాకులు. వేతనాల్లో వ్యత్యాసం, రాజకీయ వివక్షతల వలన స్త్రీ అభివృద్ధి సాధించలేకపోతున్నది. 1927లో వివాహ వయో పరిమితి పెంచుతూ శారదా యాక్టు వచ్చింది. బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ విడాకుల చట్టాన్ని ఆస్తి హక్కు చట్టాన్ని సవరిస్తూ 1950లో హిందూ కోడ్ బిల్లు వచ్చింది. మహిళల హక్కుకోసం సంక్షేమం కోసం 1947 నుంచి అనేక చట్టాలు ఆమోదించారు. మహిళల బాలికల అపహరణ నిషేధం చట్టం 1956, వివాహసంబంధాల ప్రత్యేక చట్టం (1955), హిందూ వారసత్వం (1956), వరకట్న నిషేధచట్టం 1961లో, స్త్రీ, పురుషుల సమాన వేతన చట్టం (1976), కుటుంబ న్యాయస్థానాల చట్టం (1984), లైంగిక దాడులను, వరకట్న హత్యలను నిరోధించే నేర నిరోధక చట్టం సవరణ యాక్ట్ (1985), మహిళల్ని కించపరచడాన్ని నిషేధించే చట్టం 1986 వంటి చ ట్టాలైతే వచ్చాయి. గానీ వీటి అమలులో లోపాలు ఉన్నాయి. ఫలితంగా నేడు మహిళలకు రక్షణ కరవైన దేశంగా భారత్ అంతర్జాతీయం గాఅపఖ్యాతి తెచ్చుకుంది. మహిళలపై జరుగుతున్న హింసను రూపుమా పాలని ఇది సామాజిక సమస్యగా భావించాలని దశాబ్దాలుగా మహిళలు, మహిళా సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2018 వరకు దాదాపు 37కోట్ల మంది హింస, భ్రూణ హత్యలు, అనారోగ్యం, అక్రమరవాణా వంటి చర్యలతో అంతర్థనమయ్యారని అమ ర్త్యసేన్ రిపోర్టు ప్రకటించింది. ప్రభుత్వాలు స్త్రీ, పురుష మధ్య అసమా నతలు పొగొట్టే విషయంలో ప్రపంచంలో వివిధ దేశాలు స్థితిగతులుపైన డబ్ల్యూఈఎఫ్ 142 దేశాలకు ఇచ్చిన ర్యాంకులల్లో భారతదేశానికి అత్యంత దారుణంగా 114 ర్యాంకు లభించింది. దేశంలో మొత్తం 47.8కోట్ల మం ది ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉన్నారు. వారిలో మహిళలు 24 శాతంలో పే ఉన్నత స్థానాలలో విధులు నిర్వహిస్తున్నారు. భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని గర్వంగా చెప్పుకుంటాం. కానీ లోక్‌సభలో మాత్రం 11శాతం రాజ్యసభలో 10.8శాతం మాత్రమే మహిళలు న్నారు. చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్లకు ఉద్ధేశించిన బిల్లునే గట్టెక్కించ లేక మూలనపడేసిన ఘనత మన రాజకీయనాకులది. పురుషులతో సమాన అవకాశాల విషయంలో స్త్రీలు ఇంకా ఎంతోదూరంలో ఉన్నారనేది నగసత్యం. కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు దీనికి నివారణో పాయం కనుగొనే క్రమంలో పాలకులపై ఒత్తిడి తేవాలి. చట్టాలు చేయ డం కాదు. వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వాలు పూనుకోవాలి. ఏ టా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఒక కార్యక్రమంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు జరుపుకుంటాయి కానీ ప్రభుత్వ యంత్రాంగం ఇంకా ని ద్రమత్తు వదిలించుకొని మహిళా సాధికారతకు కృషి చేయాలి.
- మన్నారం నాగరాజు
సెల్: 9550844433