Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వళ్లంతా గాయాల మయమైనవాడు
శత్రు హత్యాయత్నాలను ఎదిరించిన వాడు
అనుక్షణం జనం కోసం రణంలాగా కదిలినవాడు
దినం దినం జీవితాన్ని పణంగా పెట్టి ఏటికి ఎదురీదినవాడు
జననం-మరణం నడుమన జనం కోసం బతికినవాడు
ఉద్యమాల ధీరుడు. అసెంబ్లీ సూరీడు. మద్దికాయల ఓంకారు.
ఆయన తెలుగు ప్రజలకు సుపరిచితుడు, మంచి వక్త, వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, గొప్ప పార్లమెటేరియన్. 22 ఏండ్లు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు. 14 ఏండ్ల అజ్ఞాత, జైలు జీవితం ఆయన సొంతం. ఆయన చేసే ప్రతి పని వర్గ శత్రువుకు వెన్నుల్లో వణుకు పుట్టించేది. ఆయనను చంపేందుకు శత్రువు చేయని ప్రయత్నమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. కర్రలతో, కత్తులతో, బాంబులతో, తుపాకులతో రకరకాల దాడులతో అతని శరీరం గాయాల జల్లెడైంది. ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగినా వర్గ శత్రువు పట్ల కసీ, పోరాట ధీరత్వాన్ని మరువని వీరుడు ఓంకారు. శరీరంలో దిగిన తూటాలను తీసివేయగా ఒక తూటా మాత్రం శరీ రంలోనే ఉంది. మానని గాయం - సలుపులు తీస్తున్నట్టు చనిపోయేంత వరకు వర్గ శత్రువు ఉనికిని గుర్తు చేసేది ఆ తూటా. ''పోరాటాలు, త్యాగాలు మాత్రమే మనల్ని నిలబెడతాయి. అప్పుడు మన పొలికేక ఊళ్ల కు ఊళ్లనే కదిలిస్తుంది'' అని క్యాడర్‌కు బోధించేవాడు. చావుకీ బతుక్కీ మధ్య వెంట్రుకవాసీ తేడాతోనే బతుకుతున్నా ము, ఏ దైనా అమరత్వం అంచున మనమున్నాం. ఎప్పుడు అప్రమత్తగా ఉండాలని అనేవాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాడినయోధుడు. బాధలెన్ని ఉన్నా చిరు నవ్వుతో పలకరించే మనస్తత్వం, గువ్వలా ఒదిగిపోయే ఔన్నత్యం ఓంకారు వ్యక్తిత్వం.
ఆయన అసలు పేరు రామబ్రహ్మం. బంగారం పనిచేసే వృత్తిలో 1926 మే 12న నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూ కా ఏపూరు గ్రామంలో రామయ్య అనంతలక్ష్మి దంపతులకు జన్మించాడు. అత్తెసరు చదువులే అయినా పల్లె నడకలు నేర్పింది. బతుకు పోరాటం నేర్పింది. జైలు లోనే చదువులు... ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు నేర్చుకు న్నాడు. ఉద్యమాలతోనే మేధావి గా ఎదిగాడు. ఆర్య సమాజం ప్ర భావంతో స్వాతంత్య్ర ఉద్యమం వైపు మళ్లాడు. ఆంధ్ర మహాసభ ప్రభావంతో నిజాం నిరంకుశ నిర్బంధ పాలనపై పదహారవ యేటనే వాలెంటీర్ గా చేరాడు. ఆ తర్వాత భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన మహాత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. నిజాం సైన్యాలపై, యూనియన్ సైన్యాలపై సాయుధ పోరాటం చేశాడు. ప్రజలకు పోరాట చైతన్యాన్ని నూరిపోసి పోరాటంలో భాగస్వాములను చేశాడు. 1946 నుచి 1952 వరకు అ జ్ఞాత జీవితం గడు పుతూనే ప్రజాపోరాటాల్లో అగ్రభాగాన నిలిచిన యోధుడు. తుపాకులను మరమ్మతు చేసి కామ్రేడ్స్‌కు ఆయుధాలు అందించేవాడు. ఆయుధాలను ఉపయోగించడంలో మెలకువలు తెలిసినవాడు. ఉద్యమ కాలంలోనే 1944 లో లక్ష్మిని వివాహ మాడాడు. ఆమె జీవిత భాగస్వామిగానే కాదు, ఉద్యమ భాగస్వా మిగానూ ఆయనకు పోరాటాల్లో అండగా నిలిచింది. వారికి ఒక కుమారుడు, కుమార్త. లక్ష్మి జైలు జీవితం అనుభవిస్తున్న సమయంలోనే సంవత్సరం దాటని కూతురు చనిపోయింది. 1951లో జైలు నిర్బంధం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించడం, నరక కూపంగా జైళ్లు ఉడటం, కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడంతో లక్ష్మి చనిపో యింది. ఉద్య మంలో ఓంకార్‌తో బిఎన్.రెడ్డికి పరిచయమేర్ప డింది. ఆ నాయకులిద్దరు అనేక ఉద్యమాలు కలిసి నిర్వహించారు. వారి ద్దరు కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్ని, మనోధై ర్యాన్ని కలిగిచడమే కాదు, వారి కోసం ప్రాణాలిచ్చేవారు. ఒకానొక సందర్భంలో ఏపూరు దేశ్‌ముఖ్ దామిడి రాఘవరెడ్డి ఓంకార్‌ను పట్టుకొని గడీలో బంధించి బొప్పారం పోలీసు క్యాంపుకు తరలిస్తుండగా భీంరెడ్డి దళంకు తెలిసి రంగంలోకి దిగి పోలీసు వ్యానులను అడ్డగించి ఓంకారును విడిపించుకున్నారు. ఓంకారు మొదటి నుండి మిలటెంట్ పోరాటాలు, ప్రజా సంఘాల నిర్మాణం, భూస్వాముల భూములు, ప్రభుత్వ భూముల పంపకంలో ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించారు. నర్సంపేట, ములుగు, గార్ల, బయ్యారం అడవుల్లో ఆది వాసుల ఉద్యమ నిర్మాణంలో వారితో మమేకమై గిరిజనుల్లో గిరిజనుడుగా మెలిగాడు. నర్సంపేట భూస్వాములైన మహిబూబ్‌రెడ్డికి వ్యతిరేకగా రాజీలేని పోరాటాలు నిర్వహించారు. ఆ పోరాటంలో తనపై దాడులు కార్యకర్తలపై దాడులు ఎదుర్కొంటూనే 150 మంది పార్టీ నాయకులు సమరశీల కార్యకర్తలను కోల్పోవాల్సి వచ్చింది. 1978-79లో ఓంకార్ భార్గవ కమిషన్ ముం దు నక్సలైట్లపై ప్రభుత్వ దమన కాండను తీవ్రంగా ప్రతిఘటిం చారు. భూటకపు ఎన్‌కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తూ పాలకు లపై హత్యానేరం మోపాలని వాదించాడు. అయినప్పటికీ ఓంకారుకు నక్సలైట్ల నుంచి దాడు లు తప్పలేదు. నక్సలైట్లు ఐదు సార్లు తుపాకీ తూటాలతో దాడులు జరిపారు. తీవ్రగా గాయపడ్డ ఓంకారు శరీరంలో చనిపో యే నాటివరకు వెన్నెముక దగ్గర తుపాకీ గుండు ఆయన పోరాటాలకు ప్రబల నిదర్శనంగా నిలిచింది. 1946 సూర్యా పేట తాలూకా కమిటి సభ్యుడుగా, 1947-52 అజ్ఞాతంలో పార్టీ జనరల్ క మిటీ కార్యదర్శిగా ఉంటూ 1963లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, 1972, 78, 83, 85, 89 వరుసగా ఎన్నికల్లో ఐదు పర్యాయాలు నర్సంపేట నుండి ఎన్నికయ్యా రు. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు తలమానికం లాంటిదని అభివర్ణించాడు.
సాయుధ పోరాటం నుండి తన రాజకీయ జీవితంలో ఎక్కువకాలం అణగారిన, అట్టడుగు వర్గాలతోనే ఉండి, వర్గ, వర్ణ వ్యవస్థలను అంచనా వేశాడు. వర్గ వ్యవస్థలో భాగమే కుల వ్యవస్థ అనే పుస్తకం రాశాడు. కుల సమస్య పరిష్కారానికి బాగా అధ్యయనం చేసి అగ్రకుల ఆధిపత్యానికి, అణచి వేతకు గురవుతున్న వారికి సాంఘిక అసమానతలను తొలగించి ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం సాధిం చబడాలన్నారు. విద్య, ఉద్యోగం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలపై అగ్ర కుల సంపన్న వర్గాల ఆధిపత్యం సాగద న్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక అంత రాలకు వర్ణ వ్యవస్థకు ఉన్న సంబంధాన్ని చక్కగా చెప్పాడు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకం గా హరిజన, గిరిజన వెనుకబడిన కులాల ప్రజలను సమీకరిచి పోరాడాలి అని చెప్పారు. వర్గ రహితమైన సోషలిస్టు సమాజమే కుల వ్యవస్థను నిర్మూలిస్తున్నదనేది వాస్తవం. ఆ పని మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతాన్ని చేపట్టిన కమ్యూనిస్టు పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని చెబుతూ కుల సంఘా లెప్పుడు ఆ పని చేయలేవన్నాడు. అదే సమయంలో ఆయా కులాలకు సంబంధించిన న్యాయ సమ్మతమైన సమస్యలపై ఉద్యమాలు కమ్యూనిస్టులే నడిపినప్పుడు సముద్రంలో నదులు కలిసినట్టు కుల సంఘాలు కూడా కల్సి ప్రవహిస్తాయని గత 30 ఏండ్ల కిందనే రాశాడు. సమసమాజం రావాలన్నదే నా చిరకాల వాంఛ, ఆశయం'' అని చెప్పారు.
అరున్నర దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో అలుపెరగని పోరాటాల యోధుడిగా, విరామమెరుగని కమ్యూనిస్టుగా, కత్తిపోట్లు, బాంబుదాడులు, తుపాకీ తూటాలు సైతం ఓంకారుకు తలవంచి సెల్యూట్ చెసాయి. కానీ షుగర్, మాత్ర పిండాల వ్యాధులు శాసించి 2008 అక్టోబర్ 17న తుదిశ్వాస విడిచాడు. జీవితాన్నంత ఎర్రజెండాకిచ్చి అజెండాను మరింత ఎరుపెక్కించిన ఓంకారు జీవితం భావితరాలకు మార్గదర్శకం. జనం కోసం నినదించిన ఆయన సందేశం నిరంతరం అలలు అలలుగా మన చెవుల్లో హోరెత్తుతూనే ఉంటుంది.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343