Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహారాష్ట్ర పరిణామాలు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..అనే తరహాను గుర్తుచేస్తున్నాయి. అధికారం కోసం, పదవుల కోసం కమల క(కా)షాయం ఏదైనా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే చెబుతుంటే, హఠాత్తుగా ఏర్పడిన మహా ప్రభుత్వం సంఘటనలే ఇందుకు రుజువు. ఎమ్మెల్యేలను కొనే దగ్గర నుంచీ రాష్ట్రపతి పాలనను ఎత్తేసేవరకూ ఆగమేఘాల మీద జరిగిపోయాయి. తమకు పవర్ వస్తే చాలు అన్నట్టుగా ఉంది బీజేపీ వ్యవహారం. రెండోసారి సీఎం పీఠం మీద కూర్చున్న దేవేంద్ర ఫడ్నవీస్ 'మోడీ తల్చుకుంటే ఏదైనా సాధ్యమే..' అని కితాబివ్వడం అందరికీ తెలిసిందే. నిజమే..12 శాతం దేశ జీడీపీని ఆరు శాతానికి దిగజార్చిన ఘనత మోడీది... ఆయనతో ఏదైనా అవుద్ది... !!
- బి.బసవపున్నయ్య