Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గతితార్కిక భౌతికవాదమంటే.. | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Nov 28,2019

గతితార్కిక భౌతికవాదమంటే..

గతితార్కిక నియమాలు ప్ర కృతిపై రుద్దడం ఉండదు. ప్రకృ తిలో ఉన్నవాటిని కనుగొనడం చేస్తుంది. అభివృద్ధి చేస్తుంది. దీ నినే గతితార్కిక భౌతికవాద నియమాలని, ఆలోచనలని అంటాము. నియమాలు అంటే యాదృచ్చిక, ఆవశ్యక సంబం ధాలు. ఉదాహరణకు ఒక జం తువు ఎంతకాలం జీవించవచ్చు అన్నది అది పుట్టిన, బతికిన ప్రత్యేక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఆ జంతువు కేవలం కొద్ది గంటల్లో, కొన్ని రోజుల్లో బలికి సంబంధం కావచ్చు. లేక దశాబ్దాలపాటు బతికేదిగా ఉం డొచ్చు. ఆయా ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆధారపడి, సంభవించడం, సంభవించ కపోవడం ఉంటుంది. ఇది యాదృచ్ఛిక సంబంధం. కానీ త్వరగానో, ఆలస్యంగానో చనిపోయి తీరాల్సిందే. అంటే చావు తప్పనిసరి. ఇది చావు పుట్టుకకు సంబంధిం చిన ఆవశ్యక సంబంధం. ఇక కాగితానికి నిప్పు పెడితే కాలి మంట లేస్తుంది. పచ్చి ఆకుకు నిప్పు పెడితే మంట రాదు. నీళ్లు కింద పోస్తే పల్లానికి పారుతాయి. రాయిని కింద వేస్తే పడిన చోటే ఉంటుంది. బంతిని పైకి విసిరితే తిరిగి భూమి పైనే పడుతుంది. ఇది ఆయా వస్తువులతో ఒకదానికొకటికి గల అంతర్గత సంబం ధాన్ని బట్టి అది జరగుతుంది. ఇవి మారని నియమాలు, సూత్రాలు. ఏ స్థలంలోనై నా, ఏ కాలంలోనైనా అలాగే ఉంటాయి. ఒక క్రియకు అంతే బలంగల ప్రతిక్రియ (action and reaction)  ఉంటుందన్న న్యూటన్‌ సూత్రం విశ్వజనీనమైనదే. ఈ సూత్రాన్ని బట్టే ఇప్పుడు జెట్‌ విమానాలు నడపబడుతున్నాయి. ఈ సూత్రాల న్నీ మానవుని బుర్రలో పుట్టినవికావు. వాస్తవంలో ఉండి తేలినవి. ప్రకృతి సూత్రా లు మార్చవీలుకానివి కాబట్టి మానవులు ప్రకృతికి బానిసలుగా ఉండవలసిం దేనా? లేదు. ప్రకృతి నియమాలను తెలుసుకొని వాటిని స్వాధీనం చేసుకుని మాన వుల ప్రయోజనాలకు ఉపయోగించుకోగలడు. నిప్పు కాలే సూత్రాన్ని తెలుసుకుని, అడవులను, గ్రామాలను కాల్చివేసే నిప్పుతో రైళ్లు నడిపే యంత్రాలను తిప్పటానికి ఉపయోగించాడు. కాబట్టి మనిషి తన మేధోశక్తితో ప్రకృతిని, సమాజాన్ని మానవు లందరి ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకోగలడనే విషయం సుస్పష్టం.
కాబట్టి మన వెలుపలా లోపలా సంభవించే దాన్నంతటినీ అర్థం చేసుకోవటా నికీ, మన కార్యకలాపాల విజయానికీ విభిన్న సంబంధాలు వేరువేరు ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. వాటిలో ముఖ్యమైన పునరావృతమయ్యేవి, అతి ముఖ్యమైనవి. అటువంటి సంబంధాలను నియమాలు అంటారు. నియమం అన్నది ఒక సంబం ధం. ప్రకృతి పరిణామానికి కారణమైన సూత్రాల వలనే ప్రకృతిలో ఒక భాగమైన, అత్యున్నత స్థానంలో ఉన్న మానవ జాతి పరిణామానికి కూడా కొన్ని నిర్దిష్టమైన సూత్రాలు ఉన్నవి. ఈ సూత్రాలు కనిపెట్టడమే మార్క్స్‌, ఎంగెల్స్‌లు చేసిన కృషి.
విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి, ప్రకృతి నియమాలు కనుగొనడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలు కూడా కొన్ని సూత్రాలను సరిగా అవగాహన చేసుకోలేదు. న్యూటన్‌ పదార్థంతో సంబంధం లేనివిగా స్వతంత్రమైనవిగా దృక్కాలాలు ఉన్నాయని భావి ంచాడు. ఆకాశం అనేది అనంతమైన ఒక గాదిలాంటిదని దానికి గోడలు, నేల, కప్పు లేదని, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో విధంగా దీనిలో పెట్టబడి ఉందనీ చెప్పాడు. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం ఈ న్యూటన్‌ సిద్ధాంతం తప్పని రుజువు చేసి ంది. దిక్కాలములు కూడా వాస్తవమైనవేనని, భౌతికమైనవేననీ, సాపేక్షమైనవనీ నిరూపించాడు. వృక్ష జీవ శాస్త్రాలలో పరిశోధకులూ, జీవి పరిణామం ఒకే తీరుగా ఉంటుందని, మార్పు అసాధ్యమని అన్నారు. కానీ వానరులనుండే మానవ జాతి ఆవిర్భవించింది. యాంత్రికమైన భౌతికవాద తప్పుడు సూత్రాలకు కారణం యంత్రం ఒకే రకంగా తిరుగుతుంది కనుక. అదేవిధంగా ప్రకృతి కూడా అని భావించారు. కానీ ప్రపంచ పరిణామం, ప్రకృతి పరిణామం యాంత్రంలా ఒకే వర్తులాకారంలో జరగడం లేదు. లతాకృతిలో, తీగపైకి పాకినట్టుగా జరుగుతోంది. ఒక ప్రాణి నుండే మరొక ప్రాణి ఉద్భవిస్తోంది. అనేక మార్పులతో కూడిన ఈ పరిణామ సూత్రాలను సరిగా వివరించేవే గతితార్కిక సూత్రాలు.
ఈ ప్రపంచం అసంఖ్యాకమైన వస్తువులతో, క్రమాలతో కూడి ఉందనీ, ఈ వస్తువులు, క్రమాలు, వైవిధ్య పూరితమైనవని మనకు తెలుసు. వేటికవిగా విడివిడి అస్తిత్వాన్ని కలిగి ఉండే ఈ వస్తువులు, క్రమాలు నిజానికి వేటికవి స్వతంత్రమైనవి కావు. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఒకదానిపై ఒకటి ఆ ధారపడి ఉంటాయి. ఉదాహరణకు రైతు కార్యకలాపాలన్నీ రుతుచక్రంలో, వాతావ రణంలో వచ్చే మార్పులతో సన్నిహితంగా ముడివడి ఉండటం కనపడతుంది. ఏ పరిస్థితులలో ఏ పంట వేయాలో కూడా రైతుకు తెలిసి ఉంటుంది. అంటే సాధారణ ప్రజలకు కూడా ప్రకృతి నియమాలు తెలిసే ఉంటాయి.
గతితర్కం ఈ పరస్పర సంబంధాలు విశ్వవ్యాప్తమైనవని సార్వత్రికమైనవని గుర్తిస్తుంది. అయితే ఈ పరస్పర సంబంధంలోనే చర్యా ప్రతి చర్యతో కూడిన సంసర్గం (ఱఅ్‌వతీaష్‌ఱశీఅ) ఇమిడి ఉన్నదని గుర్తుంచుకోవాలి. పరస్పర సంసర్గం లేదా చర్యా ప్రతిచర్యల ద్వారానే వస్తువులు, క్రమాలు ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటాయి. పరస్పర సంసర్గం ద్వారానే అవి మార్పులకు గురవుతాయి. చలనంలో ఉంటాయి. ఈ పరస్పర ప్రతిచర్చే చలనం అవుతుంది.
పరస్పర సంబంధం, పరస్పర ఆధారిత, పరస్పర సంసర్గం అనేవి ప్రకృతిలో ప్రతి చోటా కనిపిస్తాయి. అస్తిత్వంలో ఉన్న ప్రపంచమంటే అత్యంత వైవిధ్యపూరితమైన పరస్పర సంబంధాలతో ముడిపడి ఉన్న వస్తువులు, క్రమాలు తప్ప వేరుకాదు. ఈ ప్రపంచం నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంబంధాలు సైతం నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి.
అయితే జడ తార్కిక పద్ధతి వస్తువుల, క్రమాల మధ్య ఉండే సంబంధాలను, పరస్పర ఆధారితను, సంసర్గాన్ని గుర్తించదు. వేటికవిగా వస్తువులనది పరిగణిస్తుంది. అందువలననే ఎంగెల్స్‌ జడ తార్కికవాది చెట్లనేగానీ అడవిని చూడలేడని వ్యాఖ్యానించాడు.
పరమాణువు కొన్ని ప్రాథమిక కణాల మధ్య సంబంధంతో ఏర్పడుతుంది. అలాగే అణువు కొన్ని పరమాణువుల మధ్య సంబంధం వలన ఏర్పడుతుంది. అణువుల మధ్య సంబంధాలలో వస్తువులు ఏర్పడతాయి. అలాగే సూర్యుడు, గ్రహాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. పరిసరాలలో నిరంతర సంబంధం నెరపడం ద్వారా జీవులు జీవ క్రియను సాధించగలుగుతాయి. ఇక ఉత్పత్తి అంటే మానవులు ప్రకృతితో నిరంతరం నెరిపే సంబంధ బాంధవ్యాలూ చర్యా ప్రతి చర్యలే. ఉత్పత్తి చేసే క్రమంలో మానవులంతా ఒకరితో ఒకరు సంబంధాలలోకి వస్తారు. మానవుల చైతన్యానికీ వారు నివసించే సామాజిక పరిస్థితులకూ పరస్పర సంబంధం ఉంటుంది. ఇలా ప్రకృతి, సమాజం పరస్పర సంబంధాల ద్వారా ఒక దానిలో ఒకటి అనుసంధానించబడి ఒక గొలుసులాగా విస్తరించి ఉంటుంది. ఈ సంబంధాల అధ్యయనమే గతితర్కం చేస్తుంది.
ఇక ప్రకృతి నిశ్చలమైనదీ, నిర్వికారమైనదీ కాదు. పైగా నిరంతర గమనమూ, మార్పు, పున: స్పష్టీ, అభివృద్ధీ కలిగిన పరిస్థితే ప్రకృతి. ప్రకృతిలో ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉదయిస్తూ, వృద్ధి పొందుతూ ఉటుంది. అదే సమయంలో ఏదో ఒకటి క్షీణిస్తూ చనిపోతూ ఉంటుంది. అందువల్ల గతితార్కిక పద్ధతి దృష్ట్యా ఆలోచించినప్పుడు పరస్పర సంబంధం, ఆధారం మాత్రమే కాక వాటి చలనమూ, మార్పు, అభివృద్ధీ అనేవి అవి ఉనికిలోకివచ్చుట, ఉనికిలో లేకుండా పోవుట అనేది కూడా ఉంటుంది.
చిన్న నలుసు మొదలుకొని అతిపెద్ద వస్తువు వరకూ, ఇసుక రేణువు మొద లుకొని సూర్య బింబం వరకూ, జీవ కణాల నుండి మానవుని వరకూ ఉనికిలోకి వచ్చుట, ఉనికిలో లేకుండా పోవుట అనే నిరంతర ప్రవాహమే, ఎడతెగని చలన మే, పరిణామ స్థితే ప్రకృతి అని ఎంగెల్స్‌ తన డైలెక్టివ్స్‌ ఆఫ్‌ నేచర్‌లో వివరిస్తాడు.
నిరంతర చనలంలో ఉన్న పదార్థం మార్పు చెందుతూ ఉంటుంది. ఇది స్థలంలో, పరిమాణంలో జరిగే మార్పు, ఇంకోటి వస్తువు యొక్క అంతర్గత ధర్మాలనూ, నిర్మాణాన్ని మార్చే విధంగా మార్పులుంటాయి. కొన్ని మార్పులు పురోగమనంగా, కొన్ని తిరోగమనంగా, అభివృద్ధికరంగా ఉంటాయి. మొత్తంగా ప్రకృతి, సమాజం మానవ ఆలోచనా క్రమం అభివృద్ధి దిశగా పురోగమిస్తూ ఉంటుంది. అభివృద్ధి అంటే కేవలం ఎదుగుదల మాత్రమే కాదు. దిగువ నుండి ఎగువకు, సరళం నుండి సంక్లిష్టానికి, కింది దశ నుండి పైదశకు తీసుకుపోయే మార్పు చలనమే అభివృద్ధి. అంతర్గత నిర్మాణాలు తిరిగి వెనక్కి మరల్చవీలుకాదు. అభివృద్ధి ఎప్పుడూ సూటిగా సాఫీగా జరిగే పురోగమనం మాత్రమే కాదు. పురోగమనం, తిరుగమనాలతో కూడిన సంక్ష్లిష్ట చనలమనీ మార్క్సిస్టు గతితర్కం భావిస్తుంది. మొత్తంగా చూస్తే అభివృద్ధి చెందుంతుంది.
సమాజాభివృద్ధి క్రమం కూడా సూటిగా సాఫీగా జరగదు. అభివృద్ధి నిరోధక పాలక వర్గాలకు, విప్లవకర వర్గాలకూ మధ్య పోరాటం ఎప్పుడూ గెలుపు, ఓటమి, గెలుపు క్రమంలోనే సాగుతుంది. ఇంగ్లాండులో పెట్టుబడిదారీ విధానం స్థిరపడటానికి వందేండ్లు పట్టింది. ఈ కాలంలో ఫ్యూడల్‌, బూర్జువాల మధ్య అధికారం చేతులు మారింది. సామాజిక పరివర్తనలో అభివృద్ధికర శక్తులే అంతిమ విజయాన్ని సాధిస్తాయి. పెట్టుబడిదారీ విధానం నుండి కమ్యూనిజానికి జరిగే పరివర్తన కూడా సుదీర్ఘమైనదిగా, గెలుపు, ఓటమి, గెలుపు అనే క్రమంలోనే సాగుతుంది. అయితే రష్యాలో పెట్టుబడిదారీ విధానం తిరిగి పునరుద్ధరణ జరిగిందనీ, ఇది తిరిగి పాత దశకు చేరుకోవడమని అనుకుంటారు. కానీ అది కాదు. సోషలిజం అంటే పెట్టుబడిదారీ విధానం కమ్యూనిజంగా పరివర్తన చెందే క్రమంలో ఒక సంధి దశ మాత్రమే. ఏ సమాజమైనా పరివర్తన దశలో ఉన్నప్పుడు అభివృద్ధికర, అభివృద్ధి నిరోధక శక్తుల మధ్య ఘర్షణ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలో గెలుపు, ఓటమి సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి దీన్ని కమ్యూనిజం నుండి పెట్టుబడిదారీ విధానానికి తిరోగమించడంగా చూడొద్దు. పెట్టుబడి విధానం నుండి కమ్యూనిజానికి పరివర్తన చెందే క్రమంలో సంభవించిన తాత్కాలిక ఓటమి మాత్రమే.
గతితార్కిక సూత్రాలు, మన సమాజానికి సమాజ మార్పులను తెలుసుకోవ డానికి, సమగ్రంగా శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగప డతాయి. ఈ గతితార్కిక సూత్రాలు వచ్చే వ్యాసాల్లో ఇంకా విపులంగా చర్చిద్దాం.
- కె.ఆనందాచారి
సెల్‌ : 9948787660



మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గవర్నమెంటుకు సోయుందా..?
పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌!
కాదేదీ ప్రచారానికి అనర్హం....
రైతును బలిపెడతారా..?
క్యాపిటల్‌ పై దాడి హీనమైన చర్య..
రైతు భారతం! నిత్య రణభరితం!!
గిరిజనులను నిర్వాసితులుగా మార్చేందుకే...
త్రిపురనేని గొప్ప దార్శనికుడు...
విద్యా విప్లవజ్యోతి ఫాతిమా బేగం
చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం!
ఐజాక్‌ న్యూటన్‌
పరిష్కారానికి నోచని గిరిజన సమస్యలు
ఆనంద భాష్పాలు
మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం
ఆర్నెల్ల సావాసం...
సర్కారు వారి పాట!
ఈ ఏడాదైనా విముక్తి దొరికేనా
ఎస్ఎఫ్ఐ 50 ఏళ్ళ ప్రస్థానం
నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం 2020
తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి
కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి!
మహిళల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి ఫూలే
కరోనా విషకోరల్లో 2020 విలవిల
అవలోకనం
తాలి బజావ్‌!
జాతీయోద్యమ స్ఫూర్తిని చాటుతున్న రైతాంగం
వంగటం కూడా ఓ కళే...!
హిట్‌ లిస్టులో లాయలిస్టు
సమాచార క్యాలెండర్లు....
ఈ చర్యలు దేనికి సంకేతం? ఆర్టీసీ కార్మికుల సందేహం

తాజా వార్తలు

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

03:43 PM

రైతులు, కేంద్రం మధ్య 10 దఫా చర్చలు ప్రారంభం

03:30 PM

వ్యవసాయశాఖ మంత్రిని అడ్డుకున్న రైతులు..

03:24 PM

కరోనా వ్యాక్సిన్..మందు బాబులకు షాక్‌

03:22 PM

CSK కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్..

03:14 PM

మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో 96 స్థానాల్లో ఆప్ గెలుపు..

03:13 PM

అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై పోలీసులకు నోటీసులు జారీ

03:09 PM

నియంత్రణ రేఖ వద్ద ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

03:06 PM

వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్

02:37 PM

ప్రేమోన్మాది ఢిల్లీబాబు ఆత్మహత్య

02:06 PM

గంటలో ఆ భోజనం తింటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ మీ సొంతం..

01:50 PM

ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్ఎస్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

01:43 PM

టెస్ట్ ర్యాకింగ్స్ : కోహ్లీ @4, పుజారా @7

01:34 PM

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హిజ్రా విజయం

01:24 PM

నా సంపూర్ణ మద్దతు అన్నాడీఎంకేకు : హీరో సుమన్

01:09 PM

భీమడోలు వింత వ్యాధి.. 28కి చేరిన బాధితుల సంఖ్య

12:58 PM

సానియా మీర్జాకు కరోనా.. బాధతో కన్నీరు పెట్టిన సానియా..

12:42 PM

అమెరికాలో హుజూరాబాద్ యువకుడు మృతి..

12:42 PM

'భారత్‌ మాతాకీ జై' అంటూ నినదించిన ఆస్ట్రేలియా అభిమాని

12:31 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత..

12:20 PM

టోల్ ప్లాజా వద్ద ఎంపీ అనుచరుల హల్ చల్..

12:05 PM

గాలిపటం ఎగరవేస్తూ కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి

11:57 AM

టీటీడీ పింక్ డైమండ్‌పై మ‌రోసారి విచార‌ణ అవ‌స‌రం లేదు: హైకోర్టు

11:51 AM

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి

11:45 AM

రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

11:43 AM

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

11:31 AM

బంజారాహిల్స్‌లో దారుణం..కూతుళ్లపై మూడేళ్లు‌గా..!

11:30 AM

భారత్​ ఎలా గెలిచిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు : రికీ పాంటింగ్

11:19 AM

ట్యాంకర్ బీభత్సం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.