Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వైరుధ్య నియమంలో ఏముంది? | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Dec 04,2019

వైరుధ్య నియమంలో ఏముంది?

''మారిపోతుందోరు కాలం మారిపోతోందీ'' అంటూ మన కళాకారులు పాడుకుంటూ ఉంటారు. నిజమే మరి.. కాలం మారిపోవడమంటే ప్రకృతిలో, సమాజంలో ప్రతిదీ మారిపోతూ ఉంటుందని అర్థం. పదార్థ భౌ తిక చలనాల కారణంగా ఆలోచ నలు కూడా మారుతాయి. మా ర్పు ఎల్లప్పుడూ జరుగుతూ ఉం టుందని చాలాసార్లు చెప్పుకు న్నాం. కొన్ని త్వరగా మారతాయి. మరికొన్ని ఆలస్యంగా మారతాయి. వడ్ల గింజ మూడునాలుగు రోజుల్లో మొక్కగా మారుతుంది. కోడి గుడ్డు పిల్లగా మారటానికి మూడు వారాలు పడుతుంది. మానవ పిండం తొమ్మిది నెలలకు మారుతుంది. భూమి లక్షల సంవత్సరాలు తీసుకుంటుంది. ఖండాలు, సముద్రాలు, గ్రహాలు కూ డా మారతాయి. అదేవిధంగా సమాజమూ మారుతుంది. బానిసలు పోయారు. రాజ్యాలు పోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది. కాబట్టి ప్రతి దాంట్లో మార్పు తథ్యం. అయితే ఈమార్పు ఎందుకు జరుగుతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మౌలికమైనది కూడా. ప్రకృతి, సమాజం మన ఆలోచనలు నిరంతరం చలనంలో ఉంటూ మార్పుకు ఎలా లోనవుతాయో వాటి కారణాలు ఏంటో గతితార్కిక నియ మాలు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఈ ప్రపంచ గతినీ స్థితినీ అర్థం చేసుకోవ డానికి చైతన్యయుతంగాకలుగజేసుకోవటానికి గతితార్కికనియమాలే మనకు సాధ నాలు. అవేమిటంటే ఒకటి విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణ నియమం. రెండో ది పరిణామాత్మక మార్పునుండి గుణాత్మకమార్పుకూ గుణాత్మక మార్పు నుండి ప రిమాణాత్మక మార్పుకూ జరిగే పరివర్తన. మూడోది అభావం అభావం చెందటం.
అయితే మూడింటిలో ముఖ్యమైనది వైరుధ్య నియమం. ఇది గతితర్కం యొ క్క అంతస్సారం. ప్రతి వస్తువులోనూ జీవిలోనూ పరస్పర విరుద్ధ శక్తులున్నవి. అవి విడదీయరానివిగా, విభజన చేయవీలు లేకుండా ఉన్నవి. అవి నిరంతరం ఘర్షి స్తూ ఉంటాయనీ దాని ఫలితంగానే చలనం, మార్పు కలుగుతున్నదనీ గతితార్కిక సూత్రంతెలుపుతున్నది. అందుకనే గతితార్కికసూత్రాల్లో ఈ వైరుధ్య నియమం ప్ర ధానమైనది. ఈసారి ఈ వైరుధ్యాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వైరుధ్యమంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఒకటిగా కనిపించేది ప్రతి ఒక్కటీ నిజానికి రెండు విరుద్ధాంశాల కలయిక. పరమాణువు ఒకటే అనుకుంటాం. అందు లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయి. విద్యుత్‌లో ధన విద్యుత్తు, రుణ విద్యుత్తు. అలాగే మన శ్వాసలో ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసాలు. హృదయస్పందనలోనూ సంకోచం, వ్యాకోచం. నడకలోనూ చలనం, నిశ్చలనాలు. గ్రహాల మధ్య ఆకర్షణ, వికర్షణ. వ్యక్తిత్వంలో మంచి, చెడ్డా. రోజులో పగలూ రాత్రి. కొలతలో పొడవు, వెడల్పు. లెక్కల్లో కూడిక, తీసివేత. వెలుగు, చీకటి. స్త్రీ, పురుషుడు. సమాజంలోనైతే భూస్వాములు, కౌలు రైతులు. పెట్టుబడిదారులు, కార్మికులు. యుద్ధం, శాంతి. సామ్రాజ్యవాదం, వలసలు. విమర్శ, ఆత్మ విమర్శ. నలుపు, తెలుపు. జననం, మరణం. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. అన్నీ రెండు విరుద్ధాంశాలతోనే ఉంటాయి.
ఈ రెండు విరుద్ధాంశాలూ ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధమైనవి. ఒకటి, ఇం కొకదాన్ని నిరాకరించుకుంటుంది. ఒకదాని స్థానంలోకి ఒకటి రావడానికి నిరంత రం ఘర్షణ పడుతుంది. అలా వాటి స్థానాలనూ మార్చుకుంటాయి. ఇదే సందర్భ ంలో ఆరెండు విరుద్ధాంశాలుఒకేక్రమంలో, వస్తువులో కలిసిసహజీవనం చేస్తుంటా యి. అంతేకాదు. ఒకదాని అస్తిత్వంతో మరొకదాని అస్థిత్వం ముడిపడి ఉంటుంది. విరుద్ధాంశాలు విడిగా ఉండవు. ఒకటి ఉంటేనే మరోటి ఉంటుంది. ఈ విరుద్ధాం శాల మధ్య ఘర్షణ, ఐక్యతనే వైరుధ్యమని అంటాము. కాబట్టి ఈ ప్రపంచమంతా వైరుధ్యాల పుట్ట అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ వైరుధ్యాల మధ్య ఘర్షణ అంటే ఏమిటి? ఐక్యత అంటే ఎలా ఉంటుంది? పరస్పరం నిరాకరించుకునేవి ఐక్యంగా ఎలా ఉంటాయి? ఐక్యత, ఘర్షణలో అభివృద్ధిని నిర్ణయించేది ఏది? మొదలైన విషయాలను మనం అవగాహన చేసుకోవాలి.
ముందుగా ఐక్యత గురించి చూద్దాం. రెండు విరుద్ధాంశాలు వాటివాటి మనుగడ కోసం సహనివాసం చేస్తాయి. అంటే కలసి ఉంటాయి. ఒకటి ఇంకొక దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒకటి లేకుండా ఇంకోటి మనలేదు. ఒకటి పోతే రెండోదీ పోతుంది. ఉదాహరణకు శ్వాసక్రియను తీసుకోండి. గాలి పీల్చడం, గాలి వదలడం ఈ రెండూ జరిగితేనే ప్రాణం ఉంటుంది. శ్వాస క్రియ ఉన్నదీ అంటే రెండూ జరుగుతున్నాయని అర్థం. ఇందులో పీల్చుకోవడం లేకపోతే వదలడం అనేదే ఉండదు. అయస్కాంతం తీసుకోండి. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం రెండూ ఉంటాయి. దాన్ని ముక్కలు చేయండి. ప్రతి ముక్కకూ ఉత్తర, దక్షిణ ధృవాలు ఉంటాయి. అంటే అయస్కాంతం ఉన్నంత కాలం ఈ ఉత్తర దక్షిణ ధృవాలుంటాయి. ఇవి లేకపోతే అది అయస్కాంతంగానే ఉండదు.
అలాగే సమాజంలోని ఉత్పత్తి ప్రక్రియలో పెట్టుబడిదారుడు, కార్మికుడు రెం డు విరుద్ధాంశాలు. పెట్టుబడిదారుడున్నంత కాలం అదనపు విలువ దోపిడీకి గుర య్యే కార్మికుడూఉంటాడు. వేతన కార్మికుడున్నాడంటే పెట్టుబడిదారుడున్నాడనే అ ర్థం. ఈ రెండు విరుద్ధాంశాలు రద్దవడమంటే ఆ పెట్టుబడిదారీ ఉత్పత్తి రద్దవడం.
విరుద్ధాంశాల మధ్య ఐక్యత అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడుతూనే, ఒకటి ఇంకొకదానిగా రూపాంతరం చెందడమూ ఉంటుంది. రెండు అంశాలు ఒకే ఒక ఎంటిటీలో ఉంటూనే ఒకానొక పరిస్థితిలో ఒకటి ఇంకొకదానిగా రూపాంతరం చె ందుతాయి. ఐక్యత అంటే అర్థం ఇదే. ఉదాహరణకు శ్వాస ప్రక్రియలో ఉచ్ఛాస స్థా నాన్ని నిచ్ఛ్వాసం, నిచ్ఛ్వాస స్థానాన్ని ఉచ్ఛ్వాసం ఆక్రమించుకుంటాయి. ఆ స్థానాల మార్పిడిశ్వాస కొనసాగినంతకాలం ఉంటుంది. పెట్టుబడిదారులు, కార్మికులు విరు ద్ధాంశాలు. శ్వాస ప్రక్రియలోలాగా క్షణక్షణమూ వారి స్థానాల్లో మార్పు రాకపోయి నా స్థానాలమార్పిడి జరుగుతుంది. సామ్యవాద వ్యవస్థలో ఇప్పుడు పాలన వర్గంగా ఉన్న పెట్టుబడిదారీ వర్గం పాలించబడే వర్గంగా మారుతుంది. నేడు పాలించబడే కార్మికవర్గం పాలకవర్గంగా మారుతుంది. కాబట్టి విరుద్ధాంశాలు ఒకదానిపైన ఒక టి ఆధారపడడమే కాదు. అసలు ముఖ్యమైనదేమంటే అవి పరస్పరం రూపాంత రం చెందడం. అంటే కొన్ని పరిస్థితుల్లో ఒక వస్తువులోని రెండు విరుద్ధాంశాలు వ్య తిరేకాంశం స్థానంలోకి మారుతాయి. వైరుధ్యం యొక్క ఐక్యతకు పూర్తి అర్థం ఇదే. విరుద్ధాంశాలు ఐక్యంగా ఉండడమంటే ఒక విరుద్ధాంశం లేకుండా మరోటి ఉండ దు. ఏ ఒక్కటీ స్వతంత్రంగా ఉనికిలోనే ఉండదు. ప్రాణమే లేకపోతే చావనేదే ఉండదు. చావు లేకపోతే ప్రాణముండదు. దురదృష్టం లేనిదే అదృష్టం ఉండదు. అసౌకర్యం లేకుండా సౌకర్యం లేదు. కష్టం లేనిదే సుఖం ఉండదు. భూస్వాములు లేకపోతే కౌలుదార్లు ఉండరు. కౌలుదార్లు లేకపోతే భూస్వాములుండరు. బూర్జువాలు లేకపోతే కార్మికవ్గం ఉండదు. కార్మికవ్గం లేకపోతే బూర్జువాలు ఉండరు. ఇదే విరుద్ధాంశాల మధ్య ఉండే ఐక్యత. నిర్థిష్ట పరిస్థితుల్లో అవి ఒక వంక పరస్పరం వ్యతిరేకిస్తాయి. మరోవంక సంబంధం కలిగి ఉంటాయి. పరస్పరం ప్రవేశిస్తాయి. వ్యాపిస్తాయి. ఆధారపడతాయి. ఈ లక్షణాన్నే ఐక్యత అంటాము.
ఇక ఘర్షణను గురించి చూద్దాం. రెండు విరుద్ధాంశాలంటేనే వాటి మధ్య ఘ ర్షణ ఉన్నదని అర్థం. ఈ రెండు విరుద్ధాంశాలు ఒకదాని స్థానాన్ని మరొకటి ఆక్రమి ంచటం కోసమై నిరంతరం పెనుగులాడుతుంటాయి. ఒకదాన్ని మరొకటి నిరాకరి ంచుకుంటాయి. దీన్ని ఘర్షణ అంటాము. పెట్టుబడిదారులు, కార్మికుల ప్రయోజ నాలు పరస్పర విరుద్ధమైనవి. పెట్టుబడిదారునికి లాభాలు పెరగడమంటే కార్మికు నిపై అదనపు విలువ దోపిడీ భారం పెరగడమని అర్థం. కార్మికుని వేతనం పెరగ డమంటే ఆ మేరకు పెట్టుబడిదారుడు దోచుకునేది తగ్గడమని అర్థం. ఈ విరుద్ధాం శాలు పెట్టుబడిదారులు, కార్మికుల మధ్య ఘర్షణ.. అంటే వర్గ పోరాటం. ఈ వర్గ పోరాటం ద్వారా పై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. వర్గ పోరాట ఫలితంగానే కార్మిక వర్గం పాలకవర్గంగా, పెట్టుబడిదారీవర్గం పాలితవర్గంగా మారుతుంది. విరుద్ధాంశాల మధ్య ఘర్షణ కారణంగానే ఒక విరుద్ధాంశం, దాని వ్యతిరేకాంశంగా మారుతుందని చూశాము. అంటే విరుద్ధాంశాల మధ్య ఐక్యతకు మూలం ఘర్షణే. రెండు విరుద్ధాంశాల మధ్య ఘర్షణ నిరంతరమూ ఉంటుంది. అయితే వాటి స్థానా ల మార్పు సమాజ పరంగా చూస్తే ఎక్కువ కాలం పడుతుంది. స్థానాల మార్పు జరిగేంత వరకూ విరుద్ధాంశాలు స్థిరంగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. విరుద్ధాంశాల మధ్య వైరుధ్యం పరిష్కారమయ్యే వరకూ ఘర్షణ ఉంటుంది. అయితే విరుద్ధాంశాల మధ్య ఐక్యత తాత్కాలికమైనది. సాపేక్షమైనది. ఘర్షణ మాత్రం నిత్యమైనది. ఈ ఘర్షణ, పరిమాణాత్మక మార్పుల దశలో ఉన్నప్పుడు విరుద్ధాంశాలు సహ నివాసం చేస్తాయి. సాపేక్ష స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. గుణాత్మక మార్పు దశలో వాటి ఐక్యత భగమవుతుంది. తిరిగి నూతన ప్రాతిపదికపై ఐక్యత నెలకొంటుంది. ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ప్రకృతిలోగానీ, సమాజంలోగానీ గుణాత్మక మార్పులకు కారణం ఈ వైరుధ్యాలే.
ఉదాహరణకు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ యాజమాన్యం (ప్రభుత్వం) ఇవి రెండు విరుద్ధాంశాలు. కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. (ఘర్షణ). తమంతతాముగానే సమ్మె విరమించారు. యాజమాన్యంతో కలిసి పని చేయడానికి సమ్మతించారు. ఈ ఘర్షణ పరిష్కారమయ్యే పరిస్థితులు రానికారణంగా తిరిగి ఐక్యతలోకి వచ్చారు. అంటే దానర్థం ఘర్షణ లేదని కాదు. ఈ ఐక్యత సాపేక్షమూ తాత్కాలికమైనదే. ఘర్షణకు విరామం మాత్రమే. తిరిగి ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఇది అంతర్గతంగా కొనసాగే క్రమం. ఘర్షణ అనేది బాహ్యం కాదు. అంతర్గతమైనది. వ్యతిరేకాంశాలు స్వతంత్రమైనవి కావు. అవి మొత్తం ప్రకియలో భాగాలు. పార్టీల నిర్వహణలో కూడా ఈ విరుద్ధాంశాలు ఉంటాయి. రెండు రకాల ఆలోచనలు ఘర్షణ పడుతుంటాయి. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం పార్టీలో రెండు పంథాల మధ్య ఐక్యత నెలకొంటుంది. అంటే మెజారిటీ పంథాను మైనారిటీ అమలు చేస్తుంది. అయితే రెండు పంథాలు వాటి మధ్య ఘర్షణ అంతరించిపోవు. ఆచరణ అనే గీటురాయిపై ఏది సరైనదో రుజువైన తర్వాత ఘర్షణ అంతరిస్తుంది.
ఈలోపు ఐక్యత భగమవుతూనే ఉంటుంది. కాబట్టి ఘర్షణ నిత్యం. ఐక్యత తాత్కాలికం. ఈ ఘర్షణ పడటమనేది కేవలం ఘర్షణ కోసమే కాదు. అభివృద్ధి క్ర మంలో ఒక అడుగు ముందుకేయటం కోసమే. ఘర్షణ లేకుంటే అక్కడ అభివృద్ధి ఉండదు. పార్టీలో అంతర్గత వైరుధ్యాన్ని విమర్శ, ఆత్మవిమర్శ పరిష్కరిస్తుంది. ఆ రకంగా వైరుధ్య నియమంలోని ఐక్యత, ఘర్షణలను అర్థం చేసుకోవాలి. అది పదా ర్థంలోనూ, పనిలోనూ, సమాజంలోనూ, సకల చలనాలలోనూ, ఆలోచనలలోనూ ఈ వైరుధ్యమే మార్పులకు దారిస్తుంది.
- కె.ఆనందాచారి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గవర్నమెంటుకు సోయుందా..?
పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌!
కాదేదీ ప్రచారానికి అనర్హం....
రైతును బలిపెడతారా..?
క్యాపిటల్‌ పై దాడి హీనమైన చర్య..
రైతు భారతం! నిత్య రణభరితం!!
గిరిజనులను నిర్వాసితులుగా మార్చేందుకే...
త్రిపురనేని గొప్ప దార్శనికుడు...
విద్యా విప్లవజ్యోతి ఫాతిమా బేగం
చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం!
ఐజాక్‌ న్యూటన్‌
పరిష్కారానికి నోచని గిరిజన సమస్యలు
ఆనంద భాష్పాలు
మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం
ఆర్నెల్ల సావాసం...
సర్కారు వారి పాట!
ఈ ఏడాదైనా విముక్తి దొరికేనా
ఎస్ఎఫ్ఐ 50 ఏళ్ళ ప్రస్థానం
నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం 2020
తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి
కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి!
మహిళల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి ఫూలే
కరోనా విషకోరల్లో 2020 విలవిల
అవలోకనం
తాలి బజావ్‌!
జాతీయోద్యమ స్ఫూర్తిని చాటుతున్న రైతాంగం
వంగటం కూడా ఓ కళే...!
హిట్‌ లిస్టులో లాయలిస్టు
సమాచార క్యాలెండర్లు....
ఈ చర్యలు దేనికి సంకేతం? ఆర్టీసీ కార్మికుల సందేహం

తాజా వార్తలు

03:24 PM

కరోనా వ్యాక్సిన్..మందు బాబులకు షాక్‌

03:22 PM

CSK కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్..

03:14 PM

మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో 96 స్థానాల్లో ఆప్ గెలుపు..

03:13 PM

అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై పోలీసులకు నోటీసులు జారీ

03:09 PM

నియంత్రణ రేఖ వద్ద ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

03:06 PM

వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్

02:37 PM

ప్రేమోన్మాది ఢిల్లీబాబు ఆత్మహత్య

02:06 PM

గంటలో ఆ భోజనం తింటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ మీ సొంతం..

01:50 PM

ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్ఎస్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

01:43 PM

టెస్ట్ ర్యాకింగ్స్ : కోహ్లీ @4, పుజారా @7

01:34 PM

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హిజ్రా విజయం

01:24 PM

నా సంపూర్ణ మద్దతు అన్నాడీఎంకేకు : హీరో సుమన్

01:09 PM

భీమడోలు వింత వ్యాధి.. 28కి చేరిన బాధితుల సంఖ్య

12:58 PM

సానియా మీర్జాకు కరోనా.. బాధతో కన్నీరు పెట్టిన సానియా..

12:42 PM

అమెరికాలో హుజూరాబాద్ యువకుడు మృతి..

12:42 PM

'భారత్‌ మాతాకీ జై' అంటూ నినదించిన ఆస్ట్రేలియా అభిమాని

12:31 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత..

12:20 PM

టోల్ ప్లాజా వద్ద ఎంపీ అనుచరుల హల్ చల్..

12:05 PM

గాలిపటం ఎగరవేస్తూ కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి

11:57 AM

టీటీడీ పింక్ డైమండ్‌పై మ‌రోసారి విచార‌ణ అవ‌స‌రం లేదు: హైకోర్టు

11:51 AM

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి

11:45 AM

రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

11:43 AM

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

11:31 AM

బంజారాహిల్స్‌లో దారుణం..కూతుళ్లపై మూడేళ్లు‌గా..!

11:30 AM

భారత్​ ఎలా గెలిచిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు : రికీ పాంటింగ్

11:19 AM

ట్యాంకర్ బీభత్సం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

11:11 AM

యూపీలో దారుణం.. 12ఏండ్ల బాలికపై లైంగిక దాడి చేసి..

11:00 AM

ఏపీ ప్రభుత్వ విధానాల కారణంగా 753మంది రైతులు బలి : లోకేశ్

10:51 AM

పొగమంచు కారణంగా 13రైళ్లు ఆలస్యం..

10:51 AM

బైకు సీటు కింద నాగుపాము...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.