Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్నేహితురాలు:నీ వారాంతపు కార్యక్రమం ఏమిటి?
నేను:'జార్జిరెడ్డి' సినిమా చూడడానికి వెళ్తున్నాను.
స్నేహితురాలు:జార్జిరెడ్డా? ఎవరతను?
ఈ సంభాషణ నా స్నేహితురాలు వేసిన ప్రశ్నను నేను మా నాన్నకు వేసిన సందర్భాన్ని గుర్తు చేసింది. 12 ఏండ్ల క్రితం మా టీచర్ ''సాహస వీరులు'' పైన ఒక వ్యాసం రాయమని అడిగినప్పుడు వెంటనే ధైర్య సాహ సాలకు మారుపేరు, నిజమైన నాయకుడైన భగత్‌సింగ్‌పైకి నా దృష్టి మళ్లి ంది. వివరంగా అతని గాథను అధ్యయనం చేసి అతని మరణంతో కలత చెందాను. ఆయన ఎక్కువ కాలం జీవించి ఉండాల్సిందని అనుకున్నాను. అతడు మరణించకపోతే ఏం జరిగి ఉండేదన్న దృశ్యాలను ఊహించడం ప్రారంభించాను. నినాదాలు ఇవ్వడానికి, ఇతరులకు ప్రేరణ కలిగించ డానికి బదులు, మంచి చేయడానికి తప్పించుకొని ఉండి ఉంటే ఏమై ఉండేదని ఊహించాను. ఈ చింతను మా నాన్నతో పంచుకున్నాను. ''అతడ్ని ఉరి తీయడం ద్వా రా లేకుండా చేయడంలో బ్రిటిష్‌వారు విజయం సాధిం చారని నీవనుకుంటున్నావా?'' అని నన్ను ప్రశ్నించాడు. ఏ మీ అర్థం కాక, సందిగ్ధంలో పడి, అంటే ''ఆయన మరణిం చలేదా?'' అని అడిగాను. నవ్వి, ''ఉరి తీయబడిన తరువా త ఆయన శ్వాస తీసుకోవడం నిలిపివేశాడా? అ ని నీవు అడిగితే, ఔను. కానీ అతడు మరణించాడా? అంటే లేదు. అతనిలాంటి వారెవరూ మరణించరు. అతనిలాంటి ప్రేర ణను, అలాంటి వీరుడ్ని చంపడం, వేలకొలది వీరులు ఉద్భవించడానికి దారితీస్తుంది. అది నిలువరించడానికి వీలులేని ఏదోఒక పెద్ద సంఘట నకు దారితీస్తుంది. వారి కలలను, ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు నడిపించే శక్తిని సృష్టిస్తుంది. వారి గాథ జార్జిరెడ్డి లాంటి గొప్ప విప్లవ వీరు లు, గొప్ప నాయకులు ఉద్భవించడానికి దారితీసింది''. మొదటిసారి 'జార్జి రెడ్డి' పేరు విన్న వెంటనే నాలో రేకెత్తిన ప్రశ్న ''అతనెవరు?''. ఆసక్తిగా అడిగాను. రెండు గంట లపాటు జార్జిరెడ్డికి సంబంధించిన నమ్మలేని గాథను నాన్న వివరించాడు.
ఈ జ్ఞాపకాలతో థియేటర్‌కు వెళ్లాను. చాలా సంతోషంగా, ఉద్వేగభ రితంగా ఉన్నాను. 'జార్జిరెడ్డి' సినిమా ట్రైలర్ చూసిన దగ్గర్నుండి నేను ఆ విధంగానే ఉన్నాను. సినిమా 153 నిమిషాలపాటు సాగింది. చుట్టుపక్కల ఉన్న శ్రోతల ప్రతిస్పందనలను గమనించాను. ఈ గాథ నేను మొదట వి న్నప్పుడు నాలో కలిగిన ప్రతిస్పందనలు వారిలో కన్పించలేదు. సినిమా తీ వ్రమైన ప్రతిస్పందన కల్గించవలసి ఉంది. సందీప్ మాధవ్ మంచి నటు డే. అతడు అన్ని సన్నివేశాలలో స్థాయి కి తగిన విధంగా జీవించాడు. కానీ కథనం, సవరణలు, కథా సంవిధానా లు ఇంకా మెరుగ్గా ఉండవలసింది. ఈ విషయమై సినిమా నుండి ఒక ఉదాహ రణ ఇస్తాను. సినిమాలోని ఒక సన్నివేశంలో జార్జిరెడ్డి విద్యార్థుల తో మాట్లాడాలని అనుకుంటాడు. కానీ ఇంతలో తన స్నేహితుడు వచ్చి వ్యతిరేక సంఘం వారు మనలో అనే క మందిని వారిగదులలో పెట్టి తాళం వేశారని చెప్తాడు. ఆ మరుక్షణం, మ రొకవ్యక్తి వచ్చి 5000 మంది గ్రౌం డ్‌కు వచ్చి ఆయన ఉపన్యాసం వినాల ని ఎదురు చూస్తున్నట్టు చెప్తాడు. ఇక్కడ నేనొక ప్రశ్న వేస్తాను - 'ఎందు కు?'. 'ఎలా?' అనే దానికన్నా 'ఎందుకు?' అనే విషయాన్ని తెలుసుకో వాలని నేను కోరుకుంటాను. జార్జిరెడ్డి ధారాళంగా మాట్లాడగలిగే ఉపన్యా సకుడు కా బట్టే వారు వచ్చారు. తన మాటల ద్వారా ప్రజలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. బహుశా ఆ కారణంగానే కొంతమంది విద్యార్థులు త లుపులు బద్దలు కొట్టి, అతని ఉపన్యాసం వినడానికి లోపలున్న విద్యార్థుల ను విడుదలచేసి ఉండవచ్చు. 'ఎలా?'అనేది ముఖ్యంకాదు, కాని 'ఎందు కు?' అనేదిముఖ్యం. అతని ఉపన్యాసాలు ఎదుటివారిని ఒప్పించే పద్ధతిలో ఉంటాయని తెలియజెప్పే సన్నివేశాలుంటే బావుండని నాకనిపించింది.
కథలో ఒక సన్నివేశం చాలా అస్పష్టంగా ఉన్నది. జార్జిరెడ్డి ఇస్రోలో జ రిగిన ఇంటర్వ్యూకు హాజరైనపుడు ఇంటర్వ్యూ చే సిన అధికారులు అతని ప్రతిభను చూసి ఆశ్చర్య పోయారు. కానీ ఉద్యోగం ఇవ్వజూపినపుడు వెంటనే దానిని తిరస్కరించాడు. ఎందుకు? దాని వెనుక ఒకగొప్ప లక్ష్యం ఉందని ఒక సాధారణ వ్యక్తి అవగాహన చేసుకోగలగాలి. కానీ శ్రోతలు పాక్షికంగానైనా అర్థం చేసుకోగలిగే విధంగా దర్శకుడు ప్రయత్నం చేయలేదు. ''జీనా హైతో మర్‌నా సీఖో, కదం కదం పర్ లఢ్‌నా సీఖో'' అనే ఒక తీవ్రమైన నినాదాన్ని జార్జిరెడ్డి ఇచ్చాడు. ఆయన తన జీవన పయనంలో అడుగడుగునా పోరాడాడు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించాడు.
సినిమాలో మరొక సన్నివేశంతో నేను దీనిని ముగిస్తాను. ఒక పథకం ప్రకారం జరిగిన ఆయన హత్య ఏబీవీపీకి చెందని ఎవరో వ్యక్తి (సినిమాలో వారిని ఏబీసీడీగా చూపించారు) చంపినట్టుగా సినిమాలో చూపించబడిం ది. కానీ నాకు తెలిసినంతవరకు జార్జిరెడ్డి హత్య పథకం, దాని అమలుకు ఏబీవీపీకి ప్రత్యక్ష సంబంధం ఉంది. సినిమాలో అతని హత్య, అతని తల్లి మరణం, వెంటనే పరిశోధక విద్యార్థి జార్జిరెడ్డి తుపాకిని హుస్సేన్‌సాగర్‌లో విసిరినట్టు, ఆ తుపాకీ బుద్ధ విగ్రహం వద్దకు చేరినట్టు చూపించబడింది. అంటే ఏమిటి? అతని మరణం హింసకు అంతం అని, ఇప్పుడు అందరం శాంతియుతంగా జీవిస్తున్నామని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఊహాజనితమైన కథకాదు. కథలో మీరు ఒక ఆకస్మికమైన ముగింపు ఇచ్చి, దాని సందేశం ఏమిటనేది శ్రోతల ఊహకు వదిలేశారు. ఇది ఒక వ్యక్తి నిజ గాథ.మీరువాస్తవాలు చూపించాలి. కానీ ఈసినిమాలో అవేవీ జరగలేదు. ఊహించడానికి వీలులేని, నాశనం చేయలేని ఒక వైభవానికి అతని మర ణం ఒక ఆరంభం. అతని మరణం అనేకమంది ప్రజాతంత్ర విద్యార్థిఉద్య మ నాయకులకు జన్మనిచ్చింది. వారు జార్జిరెడ్డి వారసులు.సాహస వీరులకు మరణం లేదు. వందల కొద్ది సాహస వీరులు ఉద్భవిస్తారు.
- నున్నా స్వేచ్ఛ
-అనువాదం: బోడపట్ల రవీందర్
(9848412451)